
రెండు ట్రాలీలు ఢీ.. ఒకరి మృతి
టేకులపల్లి: రెండు ట్రాలీలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ మృతి చెందాడు. టేకులపల్లి రామాలయం సెంటర్‌కు చెందిన జినక నాగరాజు (38) బొలెరో ట్రాలీ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలోనే శుక్రవారం రాత్రి బేతంపూడి స్టేజీ నుంచి ఇంటికి వస్తుండగా గోలియాతండా సేవాలాల్ గుడి సమీపాన సంచార చేపల విక్రయ ట్రాలీ వాహనం ఎదురెదురుగా వేగంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బొలెరో ముందు భాగం నుజ్జునుజ్జు కాగా నాగరాజు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే, చేపల వాహనం బోల్తా పడగా గాయపడిన డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ప్రమాదంతో రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో సీఐ బత్తుల సత్యనారాయణ, సిబ్బందితో వెళ్లి రాకపోకలను క్రమబద్ధీకరించారు.