పత్రికా స్వేచ్ఛను హరించొద్దు | - | Sakshi
Sakshi News home page

పత్రికా స్వేచ్ఛను హరించొద్దు

Oct 18 2025 7:17 AM | Updated on Oct 18 2025 7:17 AM

పత్రి

పత్రికా స్వేచ్ఛను హరించొద్దు

అక్రమ కేసులు, అణచివేతలు మానాలి

సాక్షి ఎడిటర్‌, జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి

జర్నలిస్టులు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన

కొత్తగూడెం, భద్రాచలం, అశ్వారావుపేట, ఇల్లెందులో ఆందోళన

అణచివేత ధోరణి సరికాదు

భయభ్రాంతులకు గురిచేయొద్దు

రాజ్యాంగ విరుద్ధ చర్యలు

మనుగడ ఉండదు

తప్పిదాలు సరిచేసుకోవాలి

కొత్తగూడెంఅర్బన్‌: నిజాలు వెలికితీసే పత్రికలపై అక్రమ కేసులు, అణచివేతలు మానాలని జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు అన్నారు. సాక్షి పత్రిక ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు పెట్టడం, ఆపై విచారణ పేరుతో నిర్బంధ కాండ విధించడం సరికాదని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోందని విమర్శించారు. సాక్షి యాజమాన్యం, జర్నలిస్టులపై ఏపీ ప్రభుత్వం కక్ష గట్టి వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ శుక్రవారం జిల్లాలో పలుచోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కొత్తగూడెం పోస్ట్‌ ఆఫీస్‌ సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఏపీ ప్రభుత్వ తీరును ముక్తకంఠంతో ఖండించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పత్రికలు, చానళ్లపై కేసులు పెట్టడమంటే రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపడమే మీడియా బాధ్యతని గుర్తుచేశారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మీడియా ప్రజా సమస్యలను, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతుందని, అవినీతిని వెలికి తీస్తుందని అన్నారు. సాక్షి పత్రిక ఎడిటర్‌పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలని, సాక్షి కార్యాలయాలపై దాడులను ఆపాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టులు జునుమాల రమేష్‌, కె.శ్రీనివాస్‌, మొటమర్రి రామకృష్ణ, సీమకుర్తి రా మకృష్ణ, భాస్కర్‌రెడ్డి, బాబు, శ్రీనివాస్‌, ఆదాబ్‌ శ్రీనివాస్‌, అశోక్‌, కొండ జంపన్న, దశరథ్‌, రవి, రాందాస్‌, ప్రవీణ్‌, ఈశ్వర్‌, సైదులు, సురేందర్‌, వాసాల చంద్రశేఖర్‌, జి.కృష్ణారావు, పి.రాము, ఆర్‌.సంజీవ్‌, గగనం శ్రీనివాస్‌, ఏ.రాజశేఖర్‌, వి.పూర్ణచందర్‌రావు, సాయిప్రసాద్‌రెడ్డి, దారా శ్రీనివాస్‌, తాళ్లూ రి నరేష్‌దాస్‌, పార్టీలు, సంఘాల నాయకులు కంచర్ల జమలయ్య, గౌని నాగేశ్వరరావు, కోటా శివశంకర్‌, తాండ్ర వెంకటేశ్వర్లు, అడ్వకేట్‌ అనుదీప్‌, రాకేష్‌, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఏపీ ప్రభుత్వం మీడియాపై అణచివేత ధోరణి అవలంబిస్తోంది. కలానికి సంకెళ్లు వేసే ప్రయత్నాలను విరమించుకోవాలి. సాక్షి ఎడిటర్‌పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి. ప్రభుత్వాలు, ప్రజలకు మధ్య వారధిగా ఉండే పత్రికల స్వేచ్ఛను హరించొద్దు.

–గౌని నాగేశ్వరరావు, సీపీఐ(ఎంఎల్‌)

న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి

ఏపీ ప్రభుత్వం సాక్షి పత్రిక, సంస్థలో పని చేసే జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేసే చర్యలు చేపట్టడం సరికాదు. జర్నలిస్టులపై కేసులు పెట్టడమంటే పత్రికా స్వేచ్ఛను హరించివేయడమే. ఇటువంటి చర్యలు మానుకోవాలి.

–కంచర్ల జమలయ్య,

సీపీఐ పట్టణ కార్యదర్శి

ప్రభుత్వం తప్పుడు దారిలో వెళ్తుంటే ప్రశ్నించే స్వేచ్ఛ పత్రికలకు ఉంటుంది. ఆ దిశగా కథనాలు రాసిన వారిని టార్గెట్‌ చేసి కేసులు పెట్టడం, నిర్బంధ విచారణ సాగించడం రాజ్యాంగ విరుద్ధ చర్యలే. ఇకనైనా ఏపీ ప్రభుత్వం తీరు మారాలి.

–తాండ్ర వెంకటేశ్వర్లు,

బహుజన సంఘాల ఐక్య వేదిక కన్వీనర్‌.

పత్రికా స్వేచ్ఛను హరించిన ప్రభుత్వాలు మనుగడ సాధించలేదు. భవిష్యత్‌లో కూడా సాధించలేవు. ప్రభుత్వాల వైఫల్యాలను ఎత్తి చూపితే కేసులు నమోదు చేయడం సరికాదు. ఏపీ ప్రభుత్వం అక్రమ కేసులను ఎత్తివేయాలి.

–మొటమర్రి రామకృష్ణ, సీనియర్‌ జర్నలిస్టు

ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపి కథనాలు రాస్తే నేరంగా భావించడం సరికాదు. తప్పిదాలను సరిచేసుకుని ప్రజలకు మేలైన పాలన అందించాలి. అక్రమ కేసులు ఎత్తి వేసి, నిర్బంధ విచారణలు నిలిపివేయాలి.

–జునుమాల రమేష్‌, సీనియర్‌ జర్నలిస్టు

పత్రికా స్వేచ్ఛను హరించొద్దు1
1/5

పత్రికా స్వేచ్ఛను హరించొద్దు

పత్రికా స్వేచ్ఛను హరించొద్దు2
2/5

పత్రికా స్వేచ్ఛను హరించొద్దు

పత్రికా స్వేచ్ఛను హరించొద్దు3
3/5

పత్రికా స్వేచ్ఛను హరించొద్దు

పత్రికా స్వేచ్ఛను హరించొద్దు4
4/5

పత్రికా స్వేచ్ఛను హరించొద్దు

పత్రికా స్వేచ్ఛను హరించొద్దు5
5/5

పత్రికా స్వేచ్ఛను హరించొద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement