
అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన
అశ్వారావుపేట: ఏపీ ప్రభుత్వం శ్రీసాక్షిశ్రీ పత్రికపై అవలంబిస్తున్న అణచివేత వైఖరికి నిరసనగా శుక్రవారం అశ్వారావుపేటలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పలు రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాల నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. తొలుత అంబేద్కర్, తెలంగాణ తల్లి, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలలు సమర్పించారు. అశ్వారావుపేటలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్ సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. జర్నలిస్టులు, ప్రజాసంఘాల నాయకులు యూఎస్ ప్రకాశరావు, ఎండీ ముబాకర్ బాబా, తాళం సూరి, మోటూరి మోహన్, సత్యవరపు సంపూర్ణ, దండాబత్తుల నరేష్, తదితరులు పాల్గొన్నారు.