ఇల్లెందు: సాక్షి పత్రికపై ఏపీ ప్రభుత్వ వేధింపుల ఆపాలని కోరుతూ జర్నలిస్టులు నిరసన తెలిపారు. శుక్రవారం జేకే సెంటర్‌లో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్(టీజేఎఫ్) జాతీయ కౌన్సిల్ సభ్యులు గుర్రం రాజేష్ మాట్లాడుతూ ఏడాది కాలంగా ఏపీ ప్రభుత్వం సాక్షి పత్రిక, జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయిస్తోందని, వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. సాక్షి కార్యాలయాల్లో సోదాలు చేయటం, కేసులు బనాయించటం పత్రికా స్వేచ్ఛను హరించటమే అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఇల్లెందుల నాగేశ్వరరావు, శ్రావణ్‌కుమార్ రెడ్డి, ఎండీ యాకూబ్‌పాషా, వేముల రాజు, గుడివాడ శ్రీనివాస్, మధు, బత్తుల కృష్ణ, రమణ, ఎస్‌ఎల్ ముత్యం, డానియేల్, వీరన్న, శివ, కిరణ్, కుమార్, యూనస్, రాజు, ఏఎస్‌రావు, నటరాజ్, విజ్ఞాన్, శేషు, ప్రసాద్, మహేష్, భాస్కర్, కిరణ్ పాల్గొన్నారు.