
జర్నలిస్టుల హక్కులను కాపాడాలి
భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్‌లో శుక్రవారం జర్నలిస్ట్ సంఘాల నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. జర్నలిస్టుల హక్కులను కాపాడాలని నినదించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం భద్రాచలం ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు, ఐజేయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు బీవీ రమణా రెడ్డి, జిల్లా కార్యదర్శి ఆనంద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై వేధింపులకు పాల్పడటం సరికాదని అన్నారు. ప్రతికా కార్యాలయాల్లోకి జొరబడి దౌర్జన్యం చేయడాన్ని పాత్రికేయలోకమంతా ఖండిస్తోందని తెలిపారు. ఎడిటర్‌పై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం భద్రాచలం సబ్ కలెక్టర్‌కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సాక్షి బ్యూరో కృష్ణగోవింద్‌తో పాటు జక్కిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, దుద్దుకూరి జ్ఞానేందర్, సత్యానంద్, దిలీప్, దుర్గాప్రసాద్‌రెడ్డి, బొల్లె రాంబాబు, విజయ్, రంజిత్, బండారి మహేష్, కాటా సత్యం, మురళి, రవికుమార్, సాయి కౌశిక్, ఈశ్వర్, వెంకటరామిరెడ్డి, ప్రసాద్ యాదవ్, ప్రేమ్, నాగేశ్వరరావు, జగన్, ప్రదీప్, శివగౌడ్, శేఖర్, ప్రసాద్ పాల్గొన్నారు.