
శ్రీకనక దుర్గమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్: శ్రీకనక దుర్గమ్మతల్లికి ఆది వారం అర్చకులు విశేష పూజలు నిర్వహించా రు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి)ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని పూ జలు చేశారు. భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఒడిబియ్యం, చీరలు, కుంకుమ, పసుపు, గాజులు అమ్మవారికి సమర్పించి మొ క్కులు చెల్లించుకున్నారు. అర్చకులు అమ్మవారికి అభిషేకం జరిపారు. ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
నేడు గిరిజన దర్బార్
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే దర్బార్‌లో గిరిజ నులు తమ సమస్యలపై అర్జీలను అందజేయాలని పీఓ పేర్కొన్నారు.
నేడు కొత్తగూడెం,
భద్రాచలంలో ప్రజావాణి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజల సౌకర్యం కోసం డివిజన్ల వారీగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం భద్రాచలం రెవెన్యూ డివిజన్ ప్రజ లు భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో, కొత్తగూడెం రెవెన్యూ డివిజన్ ప్రజలు కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించే ప్రజా వాణి కార్యక్రమాలకు హాజరై తమ సమస్యల దరఖాస్తులను అందజేయాలని సూచించారు. కలెక్టరేట్‌లోని ఇన్‌వార్డులో కూడా ప్రజలు సమస్యల దరఖాస్తులను అందజేసి రశీదులు పొందవచ్చని, సంబంధిత శాఖల అధికారులకు పరిష్కారం కోసం పంపిస్తామని వివరించారు.
కిన్నెరసానిలో
సండే సందడి
పాల్వంచరూరల్: పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో ఆదివారం సందడి నెలకొంది. మండల పరిధిలోని కిన్నెరసానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్య లో తరలివచ్చారు. డ్యామ్‌పైనుంచి జలాశయా న్ని, డీర్‌పార్కులోని దుప్పులను వీక్షించారు. ప్రకృతి అందాల నడుమ సరదాగా గడిపారు. 496మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.27,390 ఆదాయం లభించింది. 480మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.24,410 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
అనుమతి లేకపోతే
కఠిన చర్యలు
ఎస్పీ రోహిత్‌రాజు
కొత్తగూడెంటౌన్: దీపావళి పండుగ సందర్భంగా టపాసులు విక్రయించే దుకాణదారులు తప్పనిసరిగా పోలీసు అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలని ఎస్పీ రోహిత్‌రాజు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన వివరాలు వెల్లడించారు. అనుమతులు లేకుండా దుకాణాలు ఏర్పా టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టపాసుల షాపులను నిర్దేశిత ఖాళీ స్థలాల్లో మాత్రమే ఏర్పాటు చేయాలని, అందుకు సంబంధించిన ఎన్‌ఓసీ సర్టిఫికెట్ పొందుపర్చాలని తెలిపారు. క్లస్టర్‌లో 50 షాపులకు మించి ఉండొద్దని, జనావాసాల్లో టపాసుల షాపులు ఏర్పా టు చేయొద్దని, కల్యాణ మండపాల్లో, సమావేశ ప్రాంతాల్లో షాపులను ఏర్పాటు చేయొద్దని అన్నా రు. తాత్కాలిక దుకాణాల వద్ద ఆగ్నిప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలన్నారు. షాపుల వద్ద ఇసుక, నీటి సదుపాయాలను అందుబాటులోఉంచుకోవాలని కోరారు. ఆయా శాఖల అధికారుల అనుమతులు పొందాకే షాపులు ఏర్పాటు చేయాలని సూచించారు.

శ్రీకనక దుర్గమ్మతల్లికి విశేష పూజలు

శ్రీకనక దుర్గమ్మతల్లికి విశేష పూజలు