రిటైర్డ్ ఏఎస్‌ఐ మృతి
అశ్వారావుపేటరూరల్: రెండు ద్విచక్రవాహనాలు ఢీకొ న్న ఘటనలో రిటైర్డ్ ఏఎస్‌ఐ మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం ఏపీలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. అశ్వారావుపేట మున్సి పాలిటీ పరిధిలోని పేరాయిగూడేనికి చెందిన, రిటైర్డ్ ఏఎస్‌ఐ నార్లపాటి జగ్గారావు (63) ద్విచక్రవాహనంపై ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని మద్ది ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో జల్లేరు వద్ద ఎదురుగా వచ్చిన మరో ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో జగ్గారావుకు తీవ్ర గాయాలు కాగా జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. జగ్గారావు అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా పనిచేసి, ఉద్యోగ విరమణ పొందారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
పామాయిల్ గెలల చోరీపై కేసు
ములకలపల్లి: పామాయిల్ తోటలో గెలలు అక్రమంగా నరికి, తరలించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ మధుప్రసాద్ కథనం మేరకు.. మండలంలోని మొగరాలగుప్ప గ్రామానికి చెందిన కీసరి లక్ష్మణ్‌రావు పామాయిల్ తోటలో ఈ నెల 10న పక్వానికి వచ్చిన 5 టన్నుల గెలలు చోరీకి గురయ్యాయి. సోయం నాగేశ్వరరావు, సోయం లలిత గెలలు చోరీ చేశారని భాస్కర్‌రావు మంగళవారం లిఖిత పూర్వక ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.
చోరీలకు పాల్పడుతున్న ఆరుగురి అరెస్ట్
ముఠాలో భద్రాద్రి జిల్లా వాసులు
నర్సంపేటరూరల్: తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు వరంగల్ జిల్లా నర్సంపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి తెలిపారు. నర్సంపేట పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఆయన వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన మహ్మద్ ఇమ్రాన్, మాదాసు నవీన్, మాదాసు భార్గవి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం కొండాయిగూడెంనకు చెందిన కుంజా విజయ, పాల్వంచకు చెందిన బత్తుల రాజేశ్వరి ముఠాగా ఏర్పడి తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నారు. గత నెల 20న నర్సంపేటలోని పాకాల సెంటర్‌లో తాళం వేసి ఉన్న దుకాణంలో ఆభరణాలు అపహరించారు. అంతకుముందు, మహబూబాబాద్, ఖానాపురం మండలం బుధరావుపేటలో చోరీలు చేసిన ఈ ముఠా.. ఆభరణాలను విక్రయించేందుకు మహబూబాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్నారు. నర్సంపేటలో తనిఖీలు చేస్తుండగా వీరిపై అనుమానంతో ప్రశ్నించగా చోరీల విషయం బయటపడింది. దీంతో ముఠా నుంచి రూ.4.30 లక్షల విలువైన ద్విచక్రవాహనం, ఆటో, ఐదు సెల్‌ఫోన్లు, బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐలు రవికుమార్, గూడ అరుణ్ పాల్గొన్నారు.
ఏసీబీ దాడులంటూ ప్రచారం
ములకలపల్లి: ములకలపల్లి మండలంలో ఏసీబీ దాడులంటూ మంగళవారం విస్తృతంగా ప్రచారం జరిగింది. రెవెన్యూ శాఖతో పాటు, వివిధ విభాగాల ఉద్యోగులపై ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘా పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. చివరకు ఎటువంటి దాడులు లేకపోవడంతో ఆయా శాఖల ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.
ఆరు రోజుల తర్వాత మృతదేహం గుర్తింపు
ఖమ్మంఅర్బన్: ఖమ్మం టేకులపల్లి బ్రిడ్జి సమీపాన సాగర్‌కాల్వలో ఆరు రోజుల క్రితం స్నానం కోసం వెళ్లి గల్లంతైన వ్యక్తి మృతదేహం మంగళవారం లభ్యమైంది. ఖమ్మం వైఎ స్సార్ నగర్‌కు చెందిన ఎలగందుల వెంకన్న(60) కాల్వలో స్నానా నికి వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయ్యా డు. కొణిజర్ల మండలం రామనర్సయ్యనగర్ సమీపాన కాల్వలో మంగళవారంమాయన మృతదేహాన్ని గుర్తించిన స్థానాకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే మృతదేహం కుళ్లిపోవడంతో అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యా న బయటకు తీసి ఖమ్మం ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఖమ్మం అర్బన్ పోలీసులు తెలిపారు.
రెండు ద్విచక్రవాహనాలు ఢీ..