
44.6 కేజీల గంజాయి స్వాధీనం
భద్రాచలంఅర్బన్: ద్విచక్రవాహనాలపై గంజాయి తరలిస్తుండగా పట్టణంలోని కూనవరం రోడ్డులోని ఆర్టీఏ చెక్‌పోస్ట్ వద్ద ఎకై ్సజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. ఆర్టీఏ చెక్‌పోస్ట్ వద్ద ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఈఎస్ తిరుపతి ఆధ్వర్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌ఐ శ్రీహరి, సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో వరుసగా వస్తున్న మూడు ద్విచక్రవాహనాలను ఆపి తనికీ చేయగా 44.6 కేజీల ఎండు గంజాయి దొరికింది. సూర్యాపేట జిల్లాకు చెందిన బానోతు మహేశ్, గుగులోతు అశోక్, కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన రిజ్వాన్‌పాషా, ఇమ్రాన్‌పాషా, మంజునాథ, కేశవ్ కలిసి.. ఒడిశాలోని సీలేరులో గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్, బెంగళూరుకు తరలిస్తూ పట్టుబడ్డారని అధికారులు తెలిపారు. నిందితులను భద్రాచలం ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించామని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు చెప్పారు. తనిఖీల్లో ఎకై ్సజ్ హెడ్‌కానిస్టేబుళ్లు కరీం, బాలు, కానిస్టేబుళ్లు సుధీర్, హరీశ్, విజయ్, వీరబాబు, ఉపేందర్ పాల్గొన్నారు.