
108 వాహనంలో ప్రసవం
ములకలపల్లి: 108 వాహనంలో మహిళ ప్రసవించించిన ఘటన మండలంలోని చింతపేట గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రవ్వా మౌనికకు సోమవారం రాత్రి పురిటినొప్పులు రావడంతో ఆశ కార్యకర్త 108కు సమాచారం అందించారు. దీంతో 108 సిబ్బంది గ్రామానికి చేరుకొని, గర్భిణిని వాహనంలో తీసుకెళ్తుండగా మధ్యలో నొప్పులు అధికం కావడంతో రోడ్డు పక్కనే వాహనాన్ని నిలిపి ప్రసవం చేశారు. మౌనిక మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని, మంగపేట పీహెచ్‌సీకి తరలించామ ని ఈటీఎం కళాధర్, పైలట్ రాజా తెలిపారు.
విద్యుత్ ఉద్యోగుల సాహసం
పినపాక: విద్యుత్ పునరుద్ధరించేందుకు ఈ–బయ్యారం విద్యుత్ ఉద్యోగులు సాహసం చేశారు. రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షం, పిడుగులకు మణుగూరు నుంచి బయ్యారం వచ్చే 33 కేవీ లైన్లో ఐలమ్మనగర్ చెరువు, తెర్లాపురం చెరువుల సమీపంలోని స్తంభాల్లో ఇన్సులేటర్ దెబ్బతిన్నది. మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా లైన్‌మెన్లు వెంకట్రావు, స్వామి, ఏఎల్‌ఎం కామేశ్ తెప్పపై వెళ్లి స్తంభం ఎక్కి మరమ్మతులు చేసి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. దీంతో ఉద్యోగులను పలువురు అభినందించారు.
కిన్నెరసానిలో గుర్రపుడెక్క..
పాల్వంచరూరల్: కిన్నెరసాని జలాశయంలో గుర్రపుడెక్క మొక్కలు పేరుకుపోయాయి. సో మవారం కురిసిన భారీ వర్షానికి ఎగువనుంచి వచ్చిన వరదలో ఇవి కొట్టుకువచ్చి, నీటిపై ప రుచుకుంది. దీంతో నీరు పచ్చగా కనిపిస్తోంది. ఇలా వస్తున్న మొక్కలను గేట్ల మద్య నుంచి బయటకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు.
అండర్–14
కబడ్డీ జట్ల ఎంపిక
ఖమ్మంస్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి పాఠశాలల విభాగంలో అండర్–14 కబడ్డీ జట్లను మంగళవారం ఎంపిక చేశారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించిన ఎంపిక పోటీలను డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం జట్ల వివరాలను జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి వై.రామారావు ప్రకటించగా.. ఈ జట్లు 16 నుంచి సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరువులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. ఉమ్మడి జిల్లా బా లుర జట్టుకు బి.ఓంకార్తీక్, పి.సంతోష్, డి.ధనుష్, వి.జయప్రకాష్, బి.ఆకాష్, ఎ.మనోజ్, ఎ.అరుణ్, బి.అంజిబాబు, ఎ.శివ, ఎస్.గోపి, పి.బాబు, ఎస్.ప్రతీక్, బాలికల జట్టుకు సీహెచ్.గాయత్రి, డి.యామినిశ్రీ, పి.ప్రవల్లిక, బి.వర్ష, పి.సింధుజ, ఎస్‌కే ఫరీదా, కె.భవాని, పి.జాస్మిన్, ఎం.లిఖిత, కె.వినయశ్రీ, జి.సృజన, ఎం.శ్రీజ ఎంపికయ్యారని వెల్లడించారు.
సీట్ల భర్తీకి
17న తుది గడువు
పాల్వంచరూరల్: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2025–2026 విద్యా ఏడాదికి గాను ఖాళీ సీట్ల భర్తీ కోసం ఈ నెల 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు నిర్దేశించారని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సమన్వయాధికారి ఎం.అన్వేశ్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. 6వ తరగతి నుంచి 9వ తరగతిలో ప్రవేశాల కోసం ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు ఐదో తరగతి ప్రవేశ పరీక్ష రాసి, దరఖాస్తు చేయని విద్యార్థులు, పరీక్ష రాయని విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష రాసినవారు హాల్‌టికెట్, ర్యాంక్ కార్డు, కుల, ఆధాయ ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 17వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు అందజేయాలని, ప్రవేశ పరీక్ష రాయనివారు దర ఖా స్తు చేసుకుంటే కలెక్టర్ సమక్షంలో లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తామని ఆయన వివరించారు.

108 వాహనంలో ప్రసవం

108 వాహనంలో ప్రసవం