
స్వల్పంగా పెరుగుతున్న గోదావరి
భద్రాచలంటౌన్: భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం నెమ్మదిగా పెరుగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు 32 అడుగుల నీటిమట్టం ఉండగా.. శనివారం రాత్రి 33.60 అడుగులకు చేరుకుని మళ్లీ తగ్గింది. ఎగువన ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం భారీగా వస్తుండడంతో మళ్లీ ఆదివారం ఉదయం నుంచి 36.20 అడుగులకు, సోమవారం మధ్యాహ్నం 39.20 అడుగులకు చేరింది. రాత్రి 9 గంటల సమయాన 39.50 అడుగులుగా నమోదైంది. దీంతో అధికారులు స్నానఘట్టాల వద్ద ఐరెన్ మెష్‌లు అడ్డుపెట్టి భక్తులు నదిలోకి దిగకుండా చూస్తున్నారు.
నానో యూరియా వినియోగించాలి
సుజాతనగర్: నానో యూరియాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి బాబూరావు అన్నారు. స్థానిక సొసైటీ గోడౌన్‌లోని యూరియా నిల్వలను సోమవారం ఆయన తనిఖీ చేశారు. ఒకరికి ఒక బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారని, కనీసం రెండు బస్తాలు ఇచ్చేలా చూడాలని రైతులు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం యూరియా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. యూరియా బస్తాలకు బదులు నానో యూరియా వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ నర్మద, ఏఈఓ ప్రనూష తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణిలో
ఫిర్యాదుల స్వీకరణ
సూపర్‌బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీఓ మధు దరఖాస్తులు స్వీకరించారు. కొత్తగూడెం, జూలూరుపాడు, అశ్వారావుపేట, సుజాతనగర్, దమ్మపేట, ఇల్లెందు, పాల్వంచ, ములకలపల్లి మండలాల నుంచి ప్రజలు హాజరై వినతులు అందజేశారు. కార్యక్రమంలో డీఎఓ శకుంతల, ఇతర అధికారులు పాల్గొన్నారు.
విద్యార్థులు
శాస్త్రవేత్తలుగా ఎదగాలి
కొత్తగూడెంఅర్బన్: విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలని, ఇందుకోసం సైన్స్ సెమినార్లు ఉపయోగపడతాయని విద్యాశాఖ అకడమిక్ మానిటరింగ్ అధికారి ఎ.నాగరాజశేఖర్ అన్నారు. కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణా కేంద్రంలో సోమవారం జరిగిన జిల్లాస్థాయి సైన్స్ సెమినార్‌లో ఆయన మాట్లాడారు. జిల్లా స్థాయి సెమినార్‌లో ప్రథమ స్థానం సాధించిన వారు రాష్ట్రస్థాయికి, అక్కడ ప్రథమ స్థానంలో నిలిచినవారు జాతీయ స్థాయి సెమినార్‌లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. కాగా, ‘క్వాంటం ఏజ్ బిగిన్స్, పొటెన్షియల్స్ అండ్ చాలెంజెస్’ అంశంపై జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి 25 మంది విద్యార్థులు పాల్గొని వారి అభిప్రాయాలు వెల్లడించారు. ఇల్లెందు టీటీడబ్ల్యూఆర్‌ఎస్‌కు చెందిన బి.లాస్యశ్రీ ప్రథమ స్థానం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికై ందని, ద్వితీయ స్థానంలో కొమ్ముగూడెం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి వేదవ్యాస నిలవగా, కళ్యాణ రమణి, పూజిత ప్రోత్సాహక బహుమతి సాధించారని తెలిపారు. న్యాయ నిర్ణేతలుగా జి.అనురాధ, ఎస్.యశోద వ్యవహరించారు.

స్వల్పంగా పెరుగుతున్న గోదావరి

స్వల్పంగా పెరుగుతున్న గోదావరి

స్వల్పంగా పెరుగుతున్న గోదావరి