
ఉప్పొంగిన వాగులు
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బ్రిడ్జిలు నీటమునిగాయి. చెరువులు, కుంటలు అలుగుపోస్తున్నాయి. పల్లెలు, బస్తీల్లో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. పంటచేలు నీటమునిగాయి. చెట్లు నేలకూలాయి. చప్టాలు, రోడ్లు దెబ్బ తిన్నాయి. ప్రహారీలు కూలిపోయాయి. గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని గ్రామాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. మండల కేంద్రం, ఇతర ప్రధాన గ్రామాలతో సంబంధాలు తెగిపోయియి. మూకమామిడి ప్రాజెక్ట్ అలుగు పోస్తోంది. పలుచోట్ల రహదారులపైకి వరద నీరు చేరింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. చింతల చెరువు ఉప్పొంగి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ ప్రధాన రహదారిపై మోకాలి లోతు నీరు చేరింది. వర్షపునీరు చేరి కొత్తగూడెం వ్యవసాయ మార్కెట్ యార్డు చెరువును తలపించింది. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో పలు చోట్ల జనావాసాల్లోకి వరద నీరు చేరింది. హేమచంద్రపురం పంచాయతీ ట్రాక్టర్ వరద నీటిలో మునిగింది. పోలీసు, రెవెన్యూ అధికారులు వాగులను సందర్శించి ప్రజలను అప్రమత్తం చేశారు. రోడ్లపై వరద ఉధృతి ఉన్నచోట్ల హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతోపాటు రాకపోకలను నియంత్రించారు. –సాక్షి నెట్‌వర్క్

ఉప్పొంగిన వాగులు

ఉప్పొంగిన వాగులు

ఉప్పొంగిన వాగులు