
బెండాలపాడులో ఇందిరమ్మ ఇళ్ల పైలాన్‌ను నేడు ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి
రెండు గంటలపాటు భద్రాద్రి జిల్లాలో పర్యటన
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామానికి రానున్నారు. గృహప్రవేశం అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం ఇందిరమ్మ లబ్ధిదారులతో సమావేశం అవుతారు. మధ్యాహ్నం 3:15 గంటలకు రోడ్డు మార్గంలో అదే మండలంలోని దామరచర్ల వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు. గంటపాటు బహిరంగ సభలో పాల్గొంటారు.
ఏర్పాట్లలో బిజీబిజీ..
రెండు రోజులుగా సీఎం టూర్ షెడ్యూల్ ఉన్న ప్రాంతాల్లో బురదను తొలగించడం, జంగిల్ క్లియరెన్స్‌తో పాటు సభాస్థలిలో బురద నీళ్లు తోడటం వంటి పనులు నిరి్వరామంగా జరుగుతున్నాయి. మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం పర్యటన నేపథ్యంలో కొత్తగూడెం – విజయవాడ జాతీయ రహదారిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మార్గంలో వెళ్లాల్సిన వాహనాలను కల్లూరు–తల్లాడ–ఏన్కూరు మీదుగా దారి మళ్లించారు.
ప్రారంభం కూడా ఇక్కడే..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 మార్చి 11న భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ పథకం ప్రారంభించిన జిల్లాలోనే ఇప్పుడు గృహప్రవేశ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తుండటం గమనార్హం.
ఎస్‌జీడీ ఫార్మా రెండో యూనిట్ ప్రారంబోత్సవానికి...
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం మహబూబ్‌నగర్ జిల్లాకు రానున్నారు. మూసా పేట మండలం వేముల శివారులో ఉన్న ఎస్‌జీడీ ఫార్మా కార్మింగ్ టెక్నాలజీస్ కంపెనీ రెండో యూనిట్‌ను సీఎం ప్రారంభిస్తారు. హైదరాబాద్‌లో ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 11.30గంటలకు వేముల ఎస్‌జీడీ ఫార్మా పరిశ్రమ వద్దకు చేరుకుంటారు.
రెండో యూనిట్‌ను ప్రారంభించిన తర్వాత కొద్దిసేపు పరిశ్రమ ఉద్యోగులు, ఇతర అధికారులతో సీఎం ముచ్చటిస్తారు. అనంతరం 12.45 గంటలకు హెలికాప్టర్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళతారు. ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం, బహిరంగ సభ అనంతరం సాయంత్రం 4:25 గంటలకు చండ్రుగొండ నుంచి హైదరాబాద్‌కు హెలికాప్టర్‌లో సీఎం తిరుగు ప్రయాణం అవుతారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగస్వామ్యం కావాలి
సిమెంట్, స్టీల్ పరిశ్రమల యజమానులతో డిప్యూటీ సీఎం భట్టి
సాక్షి, హైదరాబాద్: ప్రజాప్ర భుత్వం మహోన్నత ఆశయంతో మానవీయకోణంలో ప్ర తిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సంక్షేమ పథకం వి జయవంతానికి రాష్ట్రంలోని సిమెంట్, స్టీల్ పరిశ్రమలు భాగస్వామ్యం కావాలని డి ప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కోరారు. మంగళవా రం సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సిమెంట్, స్టీల్ పరిశ్రమల యజమానులు, ప్రతినిధులు, అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణ యించిందని, ఇప్పటికే వేగంగా ఇళ్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు.
స్టీల్, సిమెంట్ పరిశ్రమలను ఈ రాష్ట్రంలో ఎంతగానో ప్రోత్సహించామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి స్టీల్, సిమెంట్ ధరలు తగ్గించి, భారీ భవంతుల నిర్మాణానికి ఏవిధమైన నాణ్యతతో సరఫరా చేస్తారో అలాగే రాజీ పడకుండా ఇందిరమ్మ ఇళ్లకు కూడా ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములై చేయూతనివ్వాలని శ్రీధర్‌బాబు కోరారు. పెద్ద, చిన్న అనే అంతరం లేకుండా కంపెనీలన్నీ ఒకే ధరకు సిమెంట్, స్టీల్ సరఫరా చేయాలన్నారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ప్ర భుత్వ పథకాలకు సిమెంట్ కంపెనీలు అందిస్తున్న ధరలపై సమావేశంలో సమీక్షించారు.
4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సుమారు 50 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్, 27.75 లక్షల మెట్రిక్ టన్నుల స్టీల్ అవసరం అవుతుందని అధికారులు పరిశ్రమల యజమానులు, నిర్వాహకులకు వివరించారు. ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రోత్సాహం అందించే అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తున్నామని సిమెంట్, స్టీల్ కంపెనీల యజమానులు, ప్రతినిధులు తెలిపారు. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో వీలైనంత త్వరగా సమావేశమై ధరలు ఫైనల్ చేస్తామని కంపెనీల ప్రతినిధులు తెలిపారు. సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి పాల్గొన్నారు.