
జీసీసీని ప్రగతిపథంలో నడిపించాలి
పాల్వంచరూరల్: అందరి సహకారంతో జీసీసీని ప్రగతిపథంలో నడిపించాలని డివిజనల్ అధికారి సమ్మయ్య అన్నారు. సంస్థ పాల్వంచ బ్రాంచ్ మేనేజర్‌గా వి.లక్ష్మణ్ సోమవా రం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన బీఎం లక్ష్మణ్‌కు అందరూ సహకరించాలని, ఐక్యంగా పనిచేసి సంస్థను అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లాలని సూచించారు. సమావేశంలో భద్రాచలం బీఎం జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.
నేడు పెదవి, అంగిలి చీలిక ప్రత్యేక నిర్ధారణ శిబిరం
కొత్తగూడెంఅర్బన్: పెదవి, అంగిలి చీలికతో బాధపడుతున్న బాలబాలికలకు హైదరాబాద్‌లోని హబ్సిగూడ ఉన్న ఏవీఆర్ ఆస్పత్రిలో ఉచితంగా శస్త్ర చికిత్స అందించనున్నట్లు జిల్లా సమ్మిళిత విద్యా కోఆర్డినేటర్ ఎస్‌కే.సైదులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్య నిర్ధారణకు మంగళవారం పాతకొత్తగూడెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిబిరం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రముఖ వైద్య నిపుణుడు ఎ.విజయ్‌కుమార్ శిబిరానికి హాజరవుతారని, బాధితులు సద్వి నియోగం చేసుకోవాలని వివరించారు.
ఆర్థికంగా ఎదగాలి
కొత్తగూడెంఅర్బన్: మెప్మా గ్రూప్ సభ్యులు ఆర్థికంగా ఎదగాలని, అందుకోసం రుణాలతో వ్యాపారాలు చేయాలని ట్రైనీ కలెక్టర్ సౌరభ్‌శర్మ సూచించారు. సోమవారం ఆయన మెప్మా కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. తొలుత ఎస్‌ఎల్‌ఎఫ్, ఎస్‌ఎస్‌జీ గ్రూప్స్ నిర్వహణపై సమీక్షించారు. బ్యాంకు రుణాల మంజూరు, చెల్లింపులపై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఎంసీ చంద్రశేఖర్‌బాబు, టీఎంసీ బి. వెంకటేశ్వర్లు, కమ్యూనిటీ ఆర్గనైజర్లుశాంతకుమా ర్, మౌలాలీ, సంఘం సభ్యులు పాల్గొన్నారు.