
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
చండ్రుగొండ : సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజ్ సోమవారం పరిశీలించారు. బెండాలపాడులో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో సీఎం సమావేశమయ్యే ప్రదేశాన్ని, నిర్మాణం పూర్తయిన ఇళ్లను సందర్శించారు. పారిశుద్ధ్య పనులు పూర్తి చేయాలని, చండ్రుగొండ – బెండాలపాడు రహదారిపై ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం చండ్రుగొండలో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్‌ను, దామరచర్లలో సభాస్థలిని తనిఖీ చేశారు. కాగా, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కూడా సాయంత్రం పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్ బృందం కూడా హెలీప్యాడ్‌ను తనిఖీ చేసింది. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీఓ బయ్యారపు అశోక్ తదితరులు పాల్గొన్నారు.