
రేగాను పరామర్శించిన కేటీఆర్
కరకగూడెం: మాతృ వియోగంతో బాధపడుతున్న బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును మండలంలోని కుర్నవల్లి గ్రామంలో ఉన్న ఆయన స్వగృహంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం పరామర్శించారు. రేగా మాతృమూర్తి నర్సమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, వనమా, మాజీ ఎమ్మెల్యేలు హరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావు, కందాళ ఉపేందర్ రెడ్డి, శంకర్ నాయక్, నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి, బడే నాగజ్యోతి, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు రేగాను పరామర్శించారు. భట్టుపల్లి మినీ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి కేటీఆర్ వాహనంలో రాగా, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
పాల్గొన్న పలువురు మాజీ మంత్రులు,
ఎమ్మెల్యేలు
రప్పా.. రప్పా !
పెద్దసంఖ్యలో హాజరైన పార్టీ శ్రేణులు పుష్ప–2 సినిమాలోని ’రప్పా.. రప్పా’ డైలాగ్‌తో కూడిన బోర్డులు ప్రదర్శించారు. అందులో కేటీఆర్ ఫొటోతో పాటు ‘2028లో కాంగ్రెస్ నాయకులకు మిత్తీతో సహా చెలిస్తాం.. 3.0 లోడింగ్..’ అంటూ అందులో ముద్రించారు.