
సీ్త్రనిధి.. వసూళ్ల జాడేది ?
● జిల్లాలో రూ.52.78 కోట్ల మేర బకాయిలు ● అధికారుల నిర్లక్ష్యంతోనే భారీగా పెండింగ్ ! ● ప్రత్యేక డ్రైవ్ నిర్వహణకు సన్నాహాలు
చుంచుపల్లి: మహిళలు ఆర్థికంగా ఎదిగేలా ప్రభుత్వం బ్యాంక్ లింకేజీతోపాటు సీ్త్రనిధి ద్వారా రుణా లు అందజేస్తోంది. ప్రతీనెల సకాలంలో చెల్లించే మహిళా సంఘాలకు కొత్తరుణాలు ఇస్తోంది. అయితే ఇటీవల ఎస్‌హెచ్‌జీల నుంచి రుణాల రికవరీలో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం సీ్త్రనిధి రుణ బకాయిలు భారీగా పేరుకుపోగా, వసూళ్లపై నీలినీడలు కమ్ముకున్నా యి. వ్యక్తిగత అవసరాలతోపాటు చిరు వ్యాపారాల కోసం సీ్త్రనిఽధి రుణాలు తీసుకున్న మహిళలు సకా లంలో వాయిదాలు చెల్లించడం లేదు. గత నాలుగేళ్లుగా అధికారుల నిర్లక్ష్యంతోనే బకాయిల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. జిల్లాలో సీ్త్రనిధి బకాయిలు భారీగా పేరుకుపోవడం అధికారులకు సవాల్‌గా మారింది. వీటిని రాబట్టేందుకు సెర్ప్ అధికారులు నెలరోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.
పేరుకుపోతున్న బకాయిలు
రాష్ట్ర ప్రభుత్వం అందించే బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాలు తీసుకుని మహిళలు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా రాణిస్తున్నారు. జిల్లాలోని 23 మండలాలు, నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 18,415 స్వయం సహాయక సంఘాలు ఉండగా, ఇందులో 1,81,612 మంది మహిళలు సభ్యులుగా కొనసాగుతున్నారు. వారు చిరు వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి, మహిళా శక్తి పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది భారీగా రుణాలు ఇస్తోంది. అయితే తిరిగి సకాలంలో చెల్లించకపోవడంతో బకాయిలు భారీగా పేరుకుపోయాయి. ముఖ్యంగా మెప్మా, సెర్ప్ పరిధిలో మహిళా సంఘాల సభ్యులు చెల్లించాల్సిన సీ్త్రనిధి రుణ బకాయిలు రూ.64.41 కోట్లు ఉండగా, రూ.11.81కోట్లు మాత్రమే వచ్చాయి. ఇంకా రూ.52.78కోట్ల మేర బకాయిలు వసూలు కావాల్సి ఉంది.
అధికారులు అవగాహన కల్పిస్తే..
స్వయం సహాయక సంఘాలు నెలకు రెండుసార్లు సమావేశమై అప్పులు, పొదుపు విషయం చర్చించాలి. కానీ ఈ సమావేశాలు నామమాత్రంగానే చేపడుతున్నారని తెలుస్తోంది. వీఓఏలు చెల్లించిన రుణాలు, కిస్తీలను సీ్త్రనిధి అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలి. తగినంత మంది అధికారులు, సిబ్బంది లేకపోవడంతో పనిభారంతో పర్యవేక్షణ లోపిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. మహిళా సంఘాల సభ్యులు రుణ వాయిదాలు సకాలంలో చెల్లిస్తే ప్రభుత్వం నుంచి రాయితీలు పొందే అవకాశం ఉంటుంది. ఈ విషయమై ఆయా అధికారులు సభ్యులకు అవగాహన కల్పించాలని పలువురు అంటున్నారు.
ప్రణాళిక రూపొందిస్తున్నాం
డీఆర్డీఓ ఆదేశాల మేరకు జిల్లాలో సీ్త్రనిధి బకాయిలు రాబట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా మొండి బకాయిలపై దృష్టిసారిస్తాం. నెలరోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని యోచిస్తున్నాం. గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా పర్యటించి మహిళా సంఘాలకు అవగాహన కల్పిస్తాం. పాత బకాయిలను రాబట్టేలా చర్యలు తీసుకుంటాం. – డి.నీలయ్య,
అదనపు డీఆర్‌డీఓ, సెర్ప్
పేరుకుపోయిన బకాయిలు(రూ.కోట్లలో)
మండలం బకాయి
అన్నపురెడ్డిపల్లి 1.18
అశ్వాపురం 2.26
అశ్వారావుపేట 2.16
బూర్గంపాడు 3.09
చండ్రుగొండ 1.81
చర్ల 1.76
చుంచుపల్లి 3.28
దమ్మపేట 4.53
జూలూరుపాడు 2.75
కరకగూడెం 1.10
లక్ష్మీదేవిపల్లి 2.64
మణుగూరు 3.24
ములకలపల్లి 3.31
పాల్వంచ 1.56
పినపాక 1.76
సుజాతనగర్ 1.68
టేకులపల్లి 3.16
ఇల్లెందు 2.55
మెప్మా పరిధిలో..
సీ్త్రశక్తి గ్రూపు 1.74
క్రాంతి గ్రూపు 1.67

సీ్త్రనిధి.. వసూళ్ల జాడేది ?