
ఆధార్ క్యాంప్‌లకు విశేష స్పందన
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో నిర్వహించిన మెగా ఆధార్ క్యాంపులకు విశేష స్పందన లభించిందని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకు నిర్వహించిన క్యాంపుల్లో 6,159 మంది ఆధార్ నమోదు, సవరణలు వంటి సేవలను పొందారని తెలిపారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన క్యాంప్‌లో అత్యధికంగా 3,772 మంది, భద్రాచలం క్యాంప్‌లో 801 మంది, ఇల్లెందులో 714 మంది, మణుగూరులో 525 మంది, దమ్మపేటలో 347మంది సేవలు పొందారని వివరించారు. ఈ– సేవలు, పంచాయతీ కార్యాలయాలు, ఎంపీడీఓ కా ర్యాలయాలు, బ్యాంకులు, పోస్టాఫీసులలో, స్కూల్ ఆధార్ టీంల ద్వారా సేవలు లభిస్తాయని వివరించారు. స్కూల్ ఆధార్ టీంకు సంబంధించి వివరాల కోసం జిల్లా మేనేజరు వంశీని 73311 15024 నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు. ఆధార్ సేవలపై ఫిర్యాదులు, సలహాల కోసం యూఐడీఏఐ హెల్ప్‌లైన్ నంబర్ 1947 లేదా ఈ–డిస్ట్రిక్ట్ మేనేజరు సైదేశ్వరరావును కలెక్టరేట్‌లో సంప్రదించాలని సూచించారు.
కలెక్టర్ జితేష్ వి.పాటిల్