
కరెంట్‌తో అప్రమత్తంగా ఉండాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): విద్యుత్ వినియోగదారులు, ప్రధానంగా రైతులువిద్యుత్ ప్రమాదా ల పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ ఎస్‌ఈ జి.మహేందర్ తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో తీసుకోవాల్సి జాగ్రత్తలను ఆయన వివరించారు. ఎవరూ సొంతంగా విద్యుత్ సంబంధిత మరమ్మతులు చేపట్టొద్దని సూచించారు.
ఇవి పాటించాలి
●తెగిపడిన, వేలాడుతున్న, వదులుగా, తక్కు వ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను తాకొద్దు. ప్రమాదకరంగా ఉన్నట్లు గమనించిన వెంటనే సంబంధిత విద్యుత్ సిబ్బందికి లేదా టోల్‌ఫ్రీ నంబర్ 1912కు సమాచారం ఇవ్వాలి.
●ఇళ్లలో బట్టలు ఆరవేసేందుకు ప్లాస్టిక్ దండేలను మాత్రమే వినియోగించాలి
●ఇంటి ముందు రేకులకు కూడా విద్యుత్ సరఫరా అయ్యే ప్రమాదం ఉంటుంది. విద్యుత్ సరఫరా అయ్యే వైర్లను ఎట్టి పరిస్థితుల్లో దండేలకు, రేకులకు తగలకుండా జాగ్రత్త వహించాలి
●యజమానులు పశువులను మేతకు తీసుకెళ్లేటప్పుడు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాల వద్దకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలి. విద్యుత్ వైర్లు కిందపడి ఉంటే గమనించి పశువులను దూరంగా తోలుకెళ్లాలి.
●ఇంటి వైరింగ్‌కు ఎర్తింగ్ చేయాలి. నాణ్యమైన ప్లగ్గులను సెల్ చార్జర్లకు వినియోగించాలి
●ఎవరికై నా పొరపాటున విద్యుత్ షాక్ సంభవిస్తే సమీపంలోని వ్యక్తులు అతని తాకొద్దు. అతన్ని కాపాడేందుకు కర్ర, ప్లాస్టిక్ వస్తువులు వాడాలి.
●వినియోగదారులు గృహాల్లో నాణ్యమైన వైరింగ్ చేయించుకోవాలి. రైతులు స్విచ్ బోర్డులు/మోటారు స్టార్టర్ల వద్ద భద్రతా ప్రమాణాలు పాటించక పోవడం వల్ల విద్యుత్ ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి
●వ్యవసాయ మోటార్ల వద్ద వైర్లకు ఇన్సులేషన్ తొలగిపోయే అవకాశం ఉంది. ఫుట్ వాల్వులు, ఇతర ఇనుప పరికరాలకు విద్యుత్ ప్రసారమయ్యే అవకాశం ఉంటుంది. రైతులు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. విధిగా ఎర్తింగ్ చేయాలి.
●అర్హత కలిగిన ఎలక్ట్రీషియన్లతో మాత్రమే వినియోగదారులు, రైతులు పనులు చేయించుకోవాలి
●విద్యుత్ కంచె ఏర్పాటు చేయొద్దు. ఇది చట్టరీత్యా నేరం.
●విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఫ్యూజులు మార్చడం, రిపేరు చేయడం, ఏబీ స్విచ్‌లు ఆపరేట్ చేయడం, కాలిన తీగలను సరిచేయడం వంటివి చేయొద్దు. ఆ పనులను విద్యుత్ సిబ్బందితోనే చేయించాలి.
●వ్యవసాయ మోటార్లకు, గృహాల్లో నాణ్యత కలిగిన, అతుకులు లేని సర్వీస్ వైరును మాత్రమే వినియోగించాలి.
●గ్రామీణ వినియోగదారులు విద్యుత్ సిబ్బంది లైన్‌మెన్, లైన్ ఇన్‌స్పెక్టర్, సబ్ ఇంజనీర్, సెక్ష న్ ఆఫీసర్‌లను సంప్రదించి సేవలు పొందాలి.
●ఎలాంటి విద్యుత్ సమస్యలు తలెత్తినా టోల్ ఫ్రీ నంబర్ 1912 సమాచారం ఇవ్వాలి.
కెపాసిటర్ అమర్చుకోవాలి
జూలూరుపాడు: రైతులు వ్యవసాయ మోటా ర్లకు కెపాసిటర్ అమర్చుకోవాలని ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ జి మహేందర్ సూచించారు. శనివా రం వినోభానగర్‌లో విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పొలంబాట కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ మోటార్లకు కెపాసిటర్ అమర్చకపోవడం వల్ల ట్రాన్స్‌ఫార్మర్‌పై అధిక భారం పడటంతో కాలిపోతాయన్నారు. ఇంట్లో బట్టలు ఆరవేసేందుకు దండెంగా జీఐ వైరు వినియోగించొద్దని అన్నారు. డీఈలు కృష్ణ, జి.రంగస్వామి, ఏఈ నరసింహారావు, విద్యుత్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
విద్యుత్ ఎస్‌ఈ మహేందర్

కరెంట్‌తో అప్రమత్తంగా ఉండాలి