
అధికారులకు నివేదించాం
ఢిల్లీకి చెందిన ఎన్‌జీఓ సంస్థ రాష్ట్రీయ మహిళా కోష్ రుణాల రికవరీకి సంబంధించిన సమస్య సీరియస్‌గా ఉన్న మాట వాస్తవమే. సమస్య తీవ్రతను జిల్లా అధికారులకు నివేదించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.
– సంతోష్‌కుమార్, సెర్ప్ ఏపీఎం
92 కేజీల గంజాయి స్వాధీనం
దమ్మపేట: మండలంలోని అచ్యుతాపురం గ్రామ శివారులో ఉన్న పామాయిల్ క్షేత్రంలో దాచి ఉంచిన గంజాయి ప్యాకెట్లను సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దమ్మపేట ఎస్సై సాయికిషోర్ రెడ్డి కథనం ప్రకారం... అశ్వారావుపేట మండలంలోని అచ్యుతాపురం గ్రామానికి చెందిన గుజ్జుల వెంకటేశ్వరరావుకు దమ్మపేట అర్బన్ కాలనీ శివారులో పామాయిల్ తోట ఉంది. సోమవారం వెంకటేశ్వరరావు తోటకు వెళ్లగా గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి 92 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ రూ.46,17,500 ఉంటుందని, ప్యాకెట్లను తోటలో దాచి ఉంచిన ముద్దాయిల కోసం విచారణ చేపట్టామని ఎస్‌ఐ తెలిపారు.

అధికారులకు నివేదించాం