
హక్కుపత్రాలు లేవు.. సాగు చేయొద్దు
ఇల్లెందు: సింగరేణి భూనిర్వాసితుడు, ఇల్లెందుకు చెందిన సుందర్‌లాల్‌లోధ్‌కు సింగరేణి సెక్యూరిటీ విభాగం అధికారుల నుంచి మరోమారు చుక్కెదురైంది. ఓసీ ఏర్పాటులో ఆయన 50 ఎకరాల మేర భూమి కోల్పోగా నెలల తరబడి నిరసనల అనంతరం గత ఏడాది ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రత్యా మ్నాయంగా భూమి చూపించారు. కారేపల్లి బైపాస్‌లోని సోలార్ ప్లాంట్ ఎదుట భూమిలో సాగుకు సిద్ధం కాగా మంగళవారం సెక్యూరిటీ విభాగం ఉద్యోగులు రాజేశ్, కామరాజు అడ్డుకున్నారు. హక్కు పత్రాలు లేనందున సాగు చేయడానికి అనుమతించబోమని తెలిపారు. దీంతో సుందర్‌లాల్ కుటుంబం మరోమారు ఎమ్మెల్యే కనకయ్యను ఆశ్రయించేందుకు సిద్ధమైంది.