
కళాశాలలో ఆకస్మిక తనిఖీ
దుమ్ముగూడెం: దుమ్ముగూడెం గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఇంటర్మీడియ ట్ డిప్యూటీ సెక్రటరీ హేమచందర్ మంగళవా రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధ్యాపకుల తో సమావేశం నిర్వహించారు. అడ్మిషన్లు పెరిగేలా అధ్యాపకులు కృషి చేయాలని సూచించా రు. డ్రాపవుట్లు లేకుండా చూడాలని, ప్రతీ ఒక్కరూ కాలేజీకి వచ్చేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. హాస్టల్ వసతి సమస్యను పరిష్కరించాలని వార్డెన్‌కు సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కృష్ణవేణి, అధ్యాపక బృందం, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
ఏకలవ్య విద్యాలయాల్లో
ప్రవేశానికి స్పాట్ కౌన్సెలింగ్
భద్రాచలంటౌన్: ఏకలవ్య మోడల్ సంక్షేమ విద్యాలయాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ఎనిమిది కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హ్యూమాటిక్స్ గ్రూపుల్లో సీట్లు ఖాళీగా ఉండగా, గిరిజన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. 2024–25లో ఎస్సెస్సీ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ నెల 11న చర్లలోని ఏకలవ్య విద్యాలయంలో జరిగే స్పాట్ కౌన్సెలింగ్‌కు అన్ని ధ్రువీకరణ పత్రాల ఒరిజినల్స్‌తో హాజరు కావాలని పీఓ సూచించారు.
ఆయిల్‌పామ్, పండ్ల సాగుపై దృష్టి సారించాలి
పాల్వంచరూరల్: రైతులు సంప్రదాయ పంటలకు బదులు ఆయిల్‌పామ్, పండ్ల తోటల సాగుకు మొగ్గు చూపాలని జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి సూచించారు. మండలంలోని కిన్నెరసాని గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రాంగణంలో మంగళవారం ఆమె మొక్కలు నాటి వనమహోత్స వాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఈ ఓ మాట్లాడుతూ.. చిన్న, సన్నకారు రైతు లకు ఉచితంగా మొక్కలు అందించడమే కాక నిర్వహణ ఖర్చులు కూడా ఉపాధిహామీ పథకం ద్వారా లభిస్తున్నందున ఆయిల్‌పామ్ సాగుపై దృష్టి సారించాలన్నారు. ఎంపీడీఓ కె.విజయభాస్కర్‌రెడ్డి, ఎంపీఓ చెన్నకేశవులు, ఏపీఓ పోరండ్ల రంగా, కార్యదర్శి శ్రీనివాస్‌తో పాటు కొత్వాల శ్రీనివాసరావు, బరపటి వాసు దేవరావు, కొండం వెంకన్న పాల్గొన్నారు.
బీటీపీఎస్‌ను సందర్శించిన జెన్‌కో డైరెక్టర్
మణుగూరు రూరల్: మండల పరిధిలోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌ను జెన్‌కో డైరెక్టర్(థర్మల్) వై. రాజశేఖర్ రెడ్డి మంగళవారం సందర్శించారు. ప్లాంట్‌లోని వివిధ విభాగాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. రోజు వారీ విద్యుత్ ఉత్పత్తి వివరాలను సీఈ బిచ్చన్న ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధి కారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తికి చేపట్టాల్సి న చర్యలపై పలు సూచనలు చేశారు.

కళాశాలలో ఆకస్మిక తనిఖీ