
కిన్నెరసాని జలాలు కలుషితం!
● కేటీపీఎస్ డ్రైయాష్‌ను బయటకు వదులుతున్న అధికారులు ● కిన్నెరసాని ఉప నదిలో కలుస్తున్న బూడిద ● పర్యావరణానికి, జీవరాశులకు తీరని ముప్పు
పాల్వంచ: పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ వల్ల నిత్యం వెదజల్లే జల, వాయు కాలుష్యంతో చుట్టు పక్కల ప్రాంతాలు కలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయి. ఈ ప్రాంతాన్ని ఒక రకంగా రెడ్ జోన్ పరిధిగా పరిగణిస్తున్నారు. అయితే, విద్యుత్ ఉత్పత్తి జరిగే క్రమంలో కర్మాగారం నుంచి వెలువడే వాయు కాలుష్యం ఒకవైపు ఉక్కిరిబిక్కిరి చేస్తుండ గా మరో వైపు జల కాలుష్యం మరింత ఆందోళన కలిస్తోంది. ఇప్పటికే కాలుష్యం వల్ల గాల్లో అనేక కాలుష్య ఉద్గారాలు కలిసిపోతున్నాయి. దీంతో అనేక రకాల ప్రాణాంతక వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా ఇటీ వలి కాలంలో యాష్ పాండ్‌కు వెళ్లాల్సిన డ్రై యాష్ ను అధికారులు కిన్నెరసాని వాగులో కలిసేలా చేస్తూ జలకాలుష్యానికి తెరలేపడం తీవ్రంగా కల వరం రేపుతోంది. ఇలా నిబంధనలకు విరుద్ధంగా కిన్నెరసాని జలాలను కలుషితం చేస్తున్నా కా లుష్య నియంత్రణ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.
అధిక మొత్తంలో బూడిద విడుదల
కేటీపీఎస్ 5, 6 దశల కర్మాగారంలో 1000 మెగా వాట్లు, 7వ దశ కర్మాగారంలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఇందుకు గాను సింగరేణి బొగ్గును మండించడం ద్వారా అధిక మొత్తంలో బూడిద వెలువడుతోంది. బాయిలర్‌లో బొగ్గు మండించడం ద్వారా ఫ్‌లైయాష్, డ్రైయాష్ వెలువడుతోంది. ఫ్‌లైయాష్‌ను సైలో ద్వారా యాష్ ట్యాంకర్లలో నింపి బయటకు పంపిస్తుంటారు. ఇక డ్రైయాష్‌ను యాష్ పాండ్ (బూడిద కట్ట)కు తరలించాల్సి ఉంటుంది. యాష్ పాండ్‌లో నిల్వ అయి న బూడిదను లారీల ద్వారా చిన్న తరహా పరిశ్రమలకు పంపిస్తుంటారు. కాగా 5, 6 దశల కర్మా గారంలో డ్రైయాష్‌ను పైపులైన్ల ద్వారా బూడిదకట్టకు తరలించాల్సి ఉండగా ‘సీ’ గేటు సమీపంలో పైపులైన్ వాల్వు ఓపెన్ చేసి తరచు బూడిద చెర్వు అలుగు నీళ్లలోకి వదులుతున్నారు. ఇలా బూడిద కలిసిన నీరంతా కిన్నెరసాని వాగులో కలుస్తోంది. అలా కలిసిన కిన్నెరసాని ఉప నది నీరంతా గోదావరిలోకి వెళ్తోంది. యాష్ పాండ్‌లు నిండకుండా ఇలాఅడపాదడపా అధికారులు నిబంధనలకు విరు ద్ధంగా బయటకు వదులుతుండటం వల్ల స్వచ్ఛ జలాలు కాస్తా కలుషితంగా మారిపోతున్నాయి.
ముప్పు ఎంతో..
ఈ అలుగు నీటిని చుట్టు పక్కల ఉండే రైతులు పంట భూములకు వాడుతుంటారు. వర్షాలకు అధిక మొత్తం వరద పోటేత్తితే పంట భూములు సైతం బూడిద నీటితో నిండిపోయి పంట సారం దెబ్బతింటుంది. బూడిద మేటలు వేయడం వల్ల పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కిన్నె రసాని జలాలు తాగడం వల్ల స్థానిక ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. అంతేగాక పశువు లు, జీవరాశులకు తీరని ముప్పు వాటిల్లుతోంది. ఇప్పటికే ఇక్కడి కాలుష్యం వల్ల అనేక మంది కేన్సర్, శ్వాస కోశ వ్యాధులతో ఇబ్బందులు పడు తూ అనేక మంది మృతువ్యాత పడుతున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో జల కాలుష్యానికి అధికారులు తెరలేపడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పలువురు వాపోతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టి సారించి విచారించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై 5, 6 దశల సీఈ ఎం.ప్రభాకర్‌రావును వివరణ కోరగా తన దృష్టికి రాలేదని, పరిశీలిస్తానని తెలిపారు.

కిన్నెరసాని జలాలు కలుషితం!