
ఐదుగురిని వరించిన డాక్టరేట్
ఇల్లెందురూరల్: మండంలోని వివిధ గ్రామాలకు చెందిన ఐదుగురికి డాక్టరేట్ వచ్చింది. వరంగల్‌లో జరిగిన కాకతీయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, వీసీ ప్రతాప్‌రెడ్డి చేతుల మీదుగా ఒక ఉపాధ్యాయుడు, నలుగురు అధ్యాపకులు డాక్టరేట్ అందుకున్నారు. సుభాష్‌నగర్ ఉన్నత పాఠశాల పీడీ కె.రఘు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల జువాలజీ అధ్యాపకుడు ఎం.వెంకటేశ్వరరావు, రాజనీతిశాస్త్రం అధ్యాపకుడు ఎం.రాజు, తెలుగు అధ్యాపకుడు పగిడిపల్లి వెంకటేశ్వర్లు, చరిత్ర అధ్యాపకుడు జి.శేఖర్ డాక్టరేట్ అందుకోగా ఎమ్మెల్యే కోరం కనకయ్య, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చిన్నప్పయ్య, ఎంఈఓ ఉమాశంకర్ తదితరులు అభినందించారు.