బాపట్ల | - | Sakshi
Sakshi News home page

బాపట్ల

Oct 4 2026 10:07 AM | Updated on Oct 4 2026 10:07 AM

ఆదివారం శ్రీ 4 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 నిమ్మకాయల ధరలు సాగర్‌ నీటిమట్టం పులిచింతల సమాచారం ఏఎన్‌యూలో అడ్డదారిలో ఆచార్యులకు సర్వీసులు నిర్ధారణ

న్యూస్‌రీల్‌

వైఎస్సార్‌ సీపీ హయాంలో కుదరదన్న ఉన్నత విద్యామండలి

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో అలా కుదరదన్న అప్పటి ఉన్నత విద్యామండలి నేడు అడ్డదారికి ఆమోదం తెలిపిన టీడీపీ సర్కారు అంతర్గతంగా అమలు చేసిన భారీ కుట్ర వెలుగులోకి.. పన్నెండుమంది ఆచార్యులకు బ్యాక్‌ డేటెడ్‌ సర్వీసు కలిపిన వైనం అడ్డదారి పని చూసి విస్తుపోతున్న విద్యావేత్తలు

ఆదివారం శ్రీ 4 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

7

తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.5500, గరిష్ట ధర రూ.8500, మోడల్‌ ధర రూ.7000 వరకు పలికింది.

మాచర్ల: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నీటిమట్టం శనివారం సాయంత్రానికి 537.60 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు నుంచి అవుట్‌ఫ్లో 35334 క్యూసెక్కులు ఉంది.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 29.0393 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతుంది.

ఎన్ని కమిటీలు, ఉన్నత విద్యారంగ వ్యవస్థలు కుదరదని చెబుతున్నప్పటికీ 2006 నుంచి చాలా మంది అధ్యాపకులు తమ బ్యాక్‌డేటెడ్‌ సర్వీసును కల్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. తమకు చనువుగా ఉండే ప్రజాప్రతినిధులు, గాడ్‌ ఫాదర్లతో సిఫార్సులు కూడా చేయించుకున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2019 నుంచి 2024 మధ్యలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, ఉన్నత విద్యాశాఖ మీద పెద్ద ఒత్తిడి తీసుకువచ్చారు. కానీ అన్ని అంశాలు, నిబంధనలను పరిశీలించిన ఉన్నత విద్యామండలి, ఉన్నత విద్యాశాఖ అధికారులు ఏఎన్‌యూ అధ్యాపకులకు బ్యాక్‌ డేటెడ్‌ సర్వీస్‌ కలపలేదు. అధ్యాపకుల తీవ్ర ప్రయత్నాలకు తెరదించుతూ బ్యాక్‌ డేటెడ్‌ సర్వీసు లేకుండా అధ్యాపకుల సీనియారిటీ, పదోన్నతులను నిర్ధారిస్తూ ఉన్నత విద్యామండలి సూచనలతో 2022 అక్టోబర్‌ 11న 12 మంది అధ్యాపకుల సర్వీసు వివరాలను అప్పటి ఏఎన్‌యూ రిజిస్ట్రార్‌ ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement