అందరికీ ఒకే విధానం అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

అందరికీ ఒకే విధానం అమలు చేయాలి

Oct 4 2026 10:07 AM | Updated on Oct 4 2026 10:07 AM

అందరికీ ఒకే విధానం అమలు చేయాలి

అమరావతి డెవలప్‌మెంట్‌ అడ్వయిజరీ(ఫార్మర్‌) ఫోరం సభ్యులు ఏపీ సీఆర్డీఏ కమిషనర్‌కు వినతిపత్రం అందజేత

తాడికొండ: గ్రామ కంఠాల భూముల మినహాయింపు, నిర్ధారణ విషయంలో వచ్చిన అసమానతల వలన చిన్న, సన్నకారు, మధ్యతరగతి వర్గాలు, ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని, గ్రామ కంఠాల నిర్ధారణ విషయంలో ఏర్పాటు చేసిన నియమ నిబంధనలు అందరికీ ఒకే విధంగా వర్తింపజేసి అసమానతలు, ఆందోళనలు తొలగించాలని అమరావతి డెవలప్‌మెంట్‌ అడ్వయిజరీ(ఫార్మర్‌) ఫోరం సభ్యులు కోరారు. రాయపూడిలోని ఏపీ సీఆర్డీఏ కార్యాలయంలో కమిషనర్‌ను ఫోరం సభ్యులు శనివారం కలసి వినతిపత్రం అందజేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి, భూ సమీకరణ పథకం విజయవంతం చేయడానికి, రాజధాని పరిరక్షణ సమయంలో తాము జేఏసీగా ఏర్పడి ఉద్యమం చేసి కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించామని, కానీ రాజధాని నిర్మాణంలో తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణంలో భాగస్వాములైన రైతులు, అన్ని వర్గాల ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులతో కనీసం నెలకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి రాజధాని నిర్మాణ పురోగతి వివరిస్తూ లోటుపాట్లను చర్చించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని వాటి పరిస్కారం చూపించాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ సభ్యులు ధనేకుల సుబ్బారావు, పువ్వాడ సుధాకర్‌, దామినేని శ్రీనివాసరావు, పుట్టి రామచంద్రరావు, బండ్ల పట్టాభిరామయ్య, పువ్వాడ సుధాకర్‌, బీజేపీ నాయకులు కంతేటి బ్రహ్మయ్య, జనసేన నాయకులు యర్రగోపు నాగరాజు, అంకం సువర్ణకమల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement