వెయిట్‌ లిఫ్టింగ్‌లో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

వెయిట్‌ లిఫ్టింగ్‌లో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

Oct 4 2026 10:07 AM | Updated on Oct 4 2026 10:07 AM

వెయిట్‌ లిఫ్టింగ్‌లో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక వేమూరు: జంపని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు వెయిట్‌ లిప్టింగ్‌లో రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బద్రినారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి ఎన్టీఆర్‌ స్టేడియం జిల్లా స్థాయి వెయిట్‌ లిప్టింగ్‌ ఆటలు శనివారం నిర్వహించారు. ఆటల్లో జంపని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన పి సోనీఖాన్‌ 44 కిలోలు, టి.లీలామణిధర్‌ 55, జి పవన్‌ 60 కిలోల విభాగంలో గెలుపొందారు. జి పవన్‌ను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. రాష్ట్ర స్థాయికి ఎంపికై న జి పవన్‌ను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బద్రినారాయణ, భాగ్యమ్మ, వ్యాయమ ఉపాధ్యాయులు రాంబాబు అభినందించారు. ఇంటర్‌ పరీక్షలకు ప్రైవేటుగా హాజరయ్యే అవకాశం విష పదార్థం తిని వ్యక్తి మృతి ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ ద్వారా ఎరువుల పంపిణీ నరసరావుపేటరూరల్‌: కేంద్ర ప్రభుత్వ ఆదేశా ల మేరకు ఈ ఏడాది రబీ నుంచి ఎరువుల పంపిణీని ఫ్రేమ్‌ వర్క్‌ ఫర్‌ ఫర్టిలైజర్‌ సేల్‌(ఎఫ్‌ఎఫ్‌ఎస్‌) యాప్‌ ద్వారా చేపడుతున్నట్టు జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు తెలిపారు. ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ వినియోగంపై జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని శనివారం మున్సిపల్‌ గెస్ట్‌హౌస్‌లో నిర్వహించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జగ్గారావు మాట్లాడుతూ ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ విధానాన్ని సమర్ధంగా అమలు చేయడంలో ఏడీఏ, ఏవోలు కీలక పాత్ర పోషించాలని తెలిపారు. యాప్‌ అమలుపై డబ్‌ డివిజన్‌ స్థాయి, గ్రామ స్థాయిలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించి సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. ఎఫ్‌ఎప్‌ఎస్‌ విధానం ద్వారా ఎరువుల పంపిణీ ప్రక్రియ సక్రమంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు క్షేత్రస్థాయిలో అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులు యాప్‌ను వినియోగించుకుని అవసరమైన ఎరువులు, అందుబాటులో ఉన్న డీలర్లను వారే నేరుగా ఎంచుకుని సులభంగా పొందవచ్చని తెలిపారు. శిక్షణ కార్యక్రమానికి మాస్టర్‌ ట్రైనర్లుగా రాజుపాలెం ఏవో పి.వెంకట నరసయ్య, సత్తెనపల్లి ఏవో సుబ్బారెడ్డిలు వ్యవహరించారు. జిల్లాలోని ఏడీఏలు, ఏవోలు శిక్షణకు హాజరయ్యారు. ఎస్‌ఐకి అస్వస్థత

గుంటూరు ఎడ్యుకేషన్‌: వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షలకు రెగ్యులర్‌గా కళాశాలలో చదవని విద్యార్థులు హాజరు మినహాయింపు విధానం ద్వారా ప్రైవేటు అభ్యర్థులుగా పరీక్షలు రాసే అవకాశాన్ని ఇంటర్మీడియెట్‌ బోర్డు కల్పించినట్లు ఇంటర్‌బోర్డు ఉర్దూ ప్రత్యేకాధికారి షేక్‌ నాగూర్‌వలి శనివారం ఓప్రకటనలో పేర్కొన్నారు. పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్‌లో ఆర్ట్స్‌ కోర్సులు చదివేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు. బోర్డు నిబంధనలకు అనుగుణంగా అర్హత కలిగిన అభ్యర్థులు ఎలెక్టివ్‌ లాంగ్వేజ్‌ – ఉర్దూను ఎంపిక చేసుకోవచ్చునని తెలిపారు. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పబ్లిక్‌ పరీక్షలకుప్రైవేటు అభ్యర్థులుగా హాజరు కావాలనుకునే అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 18లోపు దరఖాస్తు చేయాలని సూచించారు. ప్రైవేటు అభ్యర్థిగా నమోదు చేసుకునే విధానం, అర్హతలు, కోర్సుల వివరాలు, సబ్జెక్టుల ఎంపిక, ఇతర పూర్తి సమాచారాన్ని సమీపంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ను సంప్రదించాలని తెలిపారు. ఇంటర్మీడియట్‌లో ఎలెక్టివ్‌ లాంగ్వేజ్‌ – ఉర్దూను ఎంపిక చేసుకోవాలనుకునే అభ్యర్థులకు ఉర్దూ భాషా విద్య, సబ్జెక్టు ఎంపిక, చదువు విధానంతోపాటు సంబంధిత విద్యా అవకాశాలపై ఉచిత మార్గదర్శకత్వం కోసం 98851 39827 నంబర్లో సంప్రదించాలని తెలిపారు.

చిలకలూరిపేటటౌన్‌: మద్యం మత్తులో విష పదార్థం తిని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మురికిపూడి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వేముల చిన్నతిరుపతయ్య (54) ఈ నెల 29న రాత్రి మద్యం మత్తులో విష పదార్థం తిని ఇంటికి వచ్చాడు. అనంతరం వాంతులు చేసుకోవడాన్ని గమనించిన భార్య సుబ్బాయమ్మ, కుమార్తె వీరలక్ష్మి వెంటనే చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 2న సాయంత్రం 6.14 గంటలకు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్‌ఎస్‌ఐ జి అనిల్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

నగరంపాలెం: ముఖ్యమంత్రి పర్యటన బందోబస్తుకు హాజరైన ఓ ఎస్‌ఐ శనివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో ఆదివారం జరిగే ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు బందోబస్తు నిమిత్తం ప్రకాశం జిల్లాకు చెందిన ఎస్‌ఐ ప్రభాకరరెడ్డి హాజరయ్యారు. రాత్రి సమయంలో ఆయన అస్వస్థతకు గురికావడంతో సిబ్బంది గుంటూరులోని రమేష్‌ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement