కాలువలో ట్రాక్టర్‌ బోల్తా పడి ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

కాలువలో ట్రాక్టర్‌ బోల్తా పడి ఒకరి మృతి

Aug 4 2026 1:29 AM | Updated on Aug 4 2026 1:29 AM

కాలువలో ట్రాక్టర్‌ బోల్తా పడి ఒకరి మృతి కాకుమాను: కాలువలో ట్రాక్టర్‌ బోల్తా పడి ఒకరు మృతి చెందిన చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాలు.. రేటూరుకు చెందిన ఉప్పిరెట్ల రాజేంద్రప్రసాద్‌ ఆదివారం మధ్యాహ్నం తన సొంత పొలంలో వ్యవసాయ పనులు పూర్తిచేసి ట్రాక్టర్‌పై తిరిగి వస్తున్నారు. జమ్ములపాలెం బ్రిడ్జి సమీపంలో పొలం నుంచి ప్రధాన రహదారిపైకి ఎక్కే సమయంలో ట్రాక్టర్‌ టైర్లు జారిపోవడంతో వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలో బోల్తాపడింది. రాజేంద్రప్రసాద్‌ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య వెంకాయమ్మ ఫిర్యాదు మేరకు కాకుమాను పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో రేటూరు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. చీటింగ్‌ కేసులో నిందితుల అరెస్ట్‌ మంగళగిరి టౌన్‌: స్థలం లేకుండానే ఉన్నట్లు చూపించి మోసగించిన నిందితులను పట్టణ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. వివరాలు.. మంగళగిరి పట్టణం భార్గవపేటకు చెందిన చౌడేశ్వరి, భర్త వెంకటేశ్వరరావు టైలర్‌గా పనిచేస్తున్నాడు. వారిద్దరి పిల్లలు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్నారు. 2025 నవంబర్‌లో మంగళగిరి పట్టణానికి చెందిన యేసు అనే తెలిసిన వ్యక్తి చౌడేశ్వరి ఇంటికి వచ్చి తక్కువలో స్థలం అమ్మకానికి ఉందని నమ్మబలికాడు. గౌరీశంకర్‌, సునీల్‌, మాజీ కౌన్సిలర్‌ మునగపాటి వెంకటేశ్వరరావు అనే వ్యక్తులను యేసు వెంటబెట్టుకుని మంగళగిరి పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌ పక్కన 300 గజాల స్థలం అమ్మకానికి ఉందని చూపించారు. దాని విలువ రూ.93 లక్షలు ఉంటుందని చెప్పగా విక్రయ అగ్రిమెంట్‌, విక్రయ బయానా రశీదు, తయారు చేసిన స్టాంప్‌ పేపర్లు కూడా తీసుకొచ్చారు. అదే రోజుల లక్ష రూపాయలు నగదు ఇవ్వగా బయానా రశీదు ఇచ్చారు.స్థలాన్ని కొనుగోలు చేసేందుకు బ్యాంకులో రుణం కోసం డాక్యుమెంట్లను తీసుకెళ్లగా, బ్యాంకు అధికారులు పరిశీలించి ఈ స్థలానికి ఎలాంటి బ్యాంకు లోన్‌ రాదని చెప్పారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అప్పటికే మొత్తం అగ్రిమెంట్‌ తాలూకా అడ్వాన్స్‌ కింద రూ.15 లక్షలు ఇచ్చారు. డాక్యుమెంట్‌ పూర్తి వివరాల కోసం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లి వాళ్లు ఇచ్చిన డాక్యుమెంట్‌ను పరిశీలించమని చెప్పగా మంగళగిరి రెవెన్యూ తాలూకా డి–223/ఎ సర్వే నెంబర్‌లో 300 చదరపు గజాల స్థలం లేదని అధికారులు చెప్పారు. దీంతో వారిని నిలదీయగా మాయమాటలు చెబుతూ కాలం వెళ్లబుచ్చారు. లేని స్థలాన్ని ఉన్నట్లు చూపించారని, మోసపోయామని గ్రహించిన బాధితురాలు చౌడేశ్వరి జూన్‌ 28న మంగళగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంగళగిరి పట్టణ సీఐ వీరాస్వామి పర్యవేక్షణలో ఎస్‌ఐ రవీంద్రనాయక్‌, సిబ్బంది బృందాలుగా ఏర్పడి ఆదివారం ఇందిరానగర్‌ సెంటర్‌ వద్ద నిందితులను అరెస్ట్‌ చేశారు. 15 లక్షల రూపాయలు అడ్వాన్స్‌గా తీసుకుని మోసం చేసిన నిందితులు మాజీ కౌన్సిలర్‌ మునగపాటి వెంకటేశ్వరరావు, గౌరీశంకర్‌, ఏసులను అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి సునీల్‌ పరారీలో ఉన్నాడని, అతడ్ని కూడా త్వరలో అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరుస్తామని పట్టణ సీఐ వీరాస్వామి తెలిపారు. లారీ బోల్తా.. డ్రైవర్‌ మృతి అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

చారకొండ: పేపర్‌ లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్‌ చెందినట్లు ఎస్‌ఐ వీరబాబు తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం.. కర్ణాటక నుంచి కొల్‌కత్తాకు పేపర్‌ లోడ్‌తో లారీ వెళ్తోంది. మండలంలోని జడర్చర్ల–కోదాడ జాతీయ రహదారిపై సారంబండ తండా సమీపాన మూలమలుపున అతివేగంగా వచ్చి రోడ్డు పక్కన రేలీంగ్‌ను ఢీకొట్టి అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏపీలోని బాపట్ల జిల్లాకు చెందిన లారీ డ్రైవర్‌ కిశోర్‌బాబు(40) కుడిచేతి మణికట్టు వద్ద విరిగి తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితికి చేరుకన్నాడు. స్థానికులు గమనించి అంబులెన్స్‌లో కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ మృతిచెందాడు.

మాచర్ల రూరల్‌: మాచర్ల మండలం కంభంపాడు గ్రామానికి చెందిన రైతు కొరట రాజశేఖర్‌ (27) పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల సమాచారం మేరకు, సాగు చేసిన మొక్కజొన్న పంట ఆశించిన స్థాయిలో దిగుబడి ఇవ్వకపోవడం, అమ్మిన పంట డబ్బులు ఇంతవరకు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనస్తాపానికి గురైన రాజశేఖర్‌ పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మూడు రోజుల కిందటే పురుగుమందు తాగిన రాజశేఖర్‌ను కుటుంబ సభ్యులు వెంటనే మాచర్ల ఆసుపత్రికి, ఆ తరువాత గుంటూరు హాస్పిటల్‌ కు తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement