బాపట్ల | - | Sakshi
Sakshi News home page

బాపట్ల

Aug 4 2026 1:29 AM | Updated on Aug 4 2026 1:29 AM

మంగళవారం శ్రీ 4 శ్రీ ఆగస్టు శ్రీ 2026 నిమ్మకాయల ధరలు పులిచింతల సమాచారం సాగర్‌ నీటి మట్టం

న్యూస్‌రీల్‌

పొగాకు రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం గిట్టుబాటు ధర కల్పించాల్సిందే.. వైఎస్సార్‌ సీపీ పర్చూరు ఇన్‌చార్జి గాదె మధుసూదనరెడ్డి పర్చూరులో భారీర్యాలీ, ధర్నా పొగాకు రైతులు, మహిళా రైతులతో కిక్కిరిసిన పర్చూరు వీధులు

పొగాకు రైతుల పక్షాన వైఎస్సార్‌ సీపీ పోరుబాట

చివరి కేజీ కొనేంతవరకు పోరాడుతాం

మంగళవారం శ్రీ 4 శ్రీ ఆగస్టు శ్రీ 2026

7

తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.4000, గరిష్ట ధర రూ.7600, మోడల్‌ ధర రూ.5400 వరకు పలికింది.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 28.9183 టీఎంసీలు. విద్యుత్‌ ఉత్పత్తి నిమిత్తం ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు.

మాచర్ల: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నీటిమట్టం సోమవారం 513.10 అడుగులుగా ఉంది. తెలంగాణ లోని ఎస్‌ఎల్‌బీసీకి 900 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

వైభవంగా

ఆషాఢ సారె సంబరం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): జగన్మాత దుర్గమ్మకు అశేష భక్తజనం, భక్త బృందాలు ఆషాఢ సారె సమర్పిస్తున్నాయి. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆషాఢ మాసోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. అమ్మవారికి భక్తులతో పాటు పలువురు ప్రముఖులు, సంస్థల ప్రతినిధులు సారె సమర్పించారు. ఏపీసీపీడీసీఎల్‌ తరఫున సంస్థ సీఎండీ పుల్లారెడ్డి, డైరెక్టర్లు మురళీకృష్ణ యాదవ్‌, టి.వి.ఎస్‌.ఎన్‌.మూర్తి, వెంకటేశ్వర్లు, ఎస్‌ఈ హనుమయ్య, ఈఈ ఏడుకొండలరావు, పలువురు అధికారులు, సిబ్బంది కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపించుకున్న అనంతరం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తికి సారె సమర్పించారు.

సారె సమర్పించిన 48 బృందాలు

ఆషాఢ మాసం 20వ రోజైన సోమవారం సుమారు 48 భక్త బృందాలు, 18,432 మంది భక్తులు అమ్మవారికి సారె సమర్పించారు. సారె సమర్పించేందుకు విచ్చేసిన భక్తులతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. సారె సమ ర్పించిన భక్తులకు ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందచేశారు. దుర్గగుడిలో శానిటేషన్‌ సిబ్బంది మంగళవారం అమ్మవారికి సారె సమర్పించనున్నారు. బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి ఆవరణ నుంచి అమ్మవారి ఉత్సవ మూర్తితో ఊరేగింపుగా బయలుదేరి, కనకదుర్గనగర్‌లో బలిపీఠం అమ్మవారిని దర్శించుకుని కొండపైకి చేరుకుని సారె సమర్పిస్తారు.

పర్చూరు(చినగంజాం): టీడీపీ ప్రభుత్వ కల్లబొల్లి మాటలతో పర్చూరు ప్రాంత పొగాకు రైతులు మోసపోయారని, వారికి న్యాయం జరిగేవరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం ఆగదని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి, పర్చూరు నియోజక వర్గ ఇన్‌చార్జ్‌ గాదె మధుసూదనరెడ్డి అన్నారు. వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పర్చూరు ప్రాంత రైతుల పక్షాన పర్చూరు నియోజకవర్గ కేంద్రమైన పర్చూరులో సోమవారం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ గాదె మధుసూదనరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, నిరసన ధర్నా నిర్వహించారు. పొగాకు కాడలతో కూడిన దండను చేత పట్టుకొని ర్యాలీగా పర్చూరు బస్టాండ్‌ సెంటర్‌ నుంచి బయలు దేరి బొమ్మల సెంటర్‌ వరకు చేరి అక్కడ మహానేత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బొమ్మల సెంటర్‌లో బైఠాయించి నిరసన ధర్నా నిర్వహించారు. పర్చూరు పుర వీధులన్నీ పొగాకు రైతులు, మహిళా రైతులు, వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలతో నిండిపోయాయి. సుమారు 1000 మందికి పైగా పొగాకు రైతులు, వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

శాంతియుత ధర్నాను అడ్డుకునే యత్నం

పర్చూరు బొమ్మల సెంటర్‌ వద్ద పొగాకు రైతులు శాంతియుతంగా నిర్వహిస్తున్న ధర్నాను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పొగాకు రైతుల ధర్నాకు నాయకత్వం వహిస్తూ స్థానిక బొమ్మల సెంటర్‌ వద్ద రైతులతో బైఠాయించి ప్రశాంతంగా ధర్నా నిర్వహిస్తున్న ఇన్‌చార్జ్‌ గాదె మధుసూదనరెడ్డిని పోలీసులు అక్కడి నుంచి లేపి పంపించే ప్రయత్నం చేశారు. రైతులు అడ్డుకోవడంతో పోలీసులు మిన్నకుండి పోయారు. అనంతరం రైతులు, నేతలు ట్రాఫిక్‌కు, ప్రజలకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశ్యంతో అక్కడి నుండి లేచి ర్యాలీగా తహసీల్దార్‌ కార్యాలయం వరకు వెళ్లి.. తహసీల్దార్‌ బ్రహ్మయ్యకు ఇన్‌చార్జ్‌ మధుసూదనరెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. వినతి పత్రంలో పొగాకు రైతులు పండించిన పొగాకును చివరి కేజీ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు.

రైతుల పట్ల పక్షపాత వైఖరి

వైఎస్సార్‌ సీపీ పర్చూరు ఇన్‌చార్జి మధుసూదనరెడ్డి పొగాకు రైతులనుద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం పర్చూరులో మార్క్‌ఫెడ్‌ ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల పట్ల పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారని దుయ్యబట్టారు. పర్చూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల నుంచి అధికార పార్టీకి చెందిన ప్రతినిధులను పొగాకు కొనుగోలు కేంద్రం వద్ద ఉంచి కేవలం వారి అనుయాయులు, వారికి సంబంధించిన రైతుల వద్ద నుంచి మాత్రమే పొగాకు కొనుగోలు చేశారని మిగిలిన రైతుల వద్ద 10 శాతం కూడా కొనుగోలు చేయకపోగా నాణ్యత లేదని తిప్పి పంపారన్నారు.

● వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో బ్లాక్‌ బర్లీ పొగాకు క్వింటా రూ.17 వేలు వరకు అమ్ముడుపోగా ప్రస్తుతం క్వింటా ధర రూ.2500లకు మాత్రమే దళారులు కొనుగోలు చేసే పరిస్థితి వచ్చిందన్నారు. అప్పులు తెచ్చి మరీ పండించిన పొగాకు పంట అమ్ముడుపోక పర్చూరు ప్రాంతంలోని అన్ని గ్రామాల రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు.

కార్యక్రమంలోపార్టీ పర్చూరు నియోజకవర్గ పరిశీలకులు ఎ.కోటేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి బండారు ప్రభాకరరావు, మండల కన్వీనర్‌లు కఠారి అప్పారావు, చిన్ని పూర్ణారావు, జువ్వా శివరాం ప్రసాద్‌, జంపని వీరయ్య చౌదరి, మహిళా అధ్యక్షురాలు జువ్వా కోమలారాణి, మహిళా నాయకులు తాటిపర్తి లక్ష్మి, నాగమణి, కొసనా రామ్‌ప్రసాద్‌, జిల్లా కార్యదర్శి పులఖండం రామకృష్ణారెడ్డి, నియోజకవర్గ బూత్‌ స్థాయి అధ్యక్షుడు ముప్పాళ్ల రాఘవయ్య, లంకా శివ, కొల్లా శ్రీహరి, యద్దనపూడి హరి ప్రసాద్‌, దాసరి వెంకటరావు, కంచనపల్లి రమేష్‌ నాయుడు, కొర్రపాటి అనిల్‌, బట్టు అనిల్‌ కుమార్‌, నియోజక వర్గ పంచాయతీ రాజ్‌ విభాగం అధ్యక్షుడు ఆసోది బ్రహ్మానందరెడ్డి, కేవీ సుబ్బారావు చౌదరి, ఉప్పలపాటి అనిల్‌ కుమార్‌, మువ్వల రాంబాబు, మైలా నాగేశ్వరరావు, దొడ్ల రవి, శాంతారావు,బండి రాంబాబు, గాదె సురేష్‌, చల్లా సుబ్బారెడ్డి, యర్రం సుబ్బారెడ్డి, మాటవరపు రవికుమార్‌, సయ్యద్‌ సుభాని, యార్లగడ్డ శ్రీకాంత్‌, నూర్‌ అహ్మద్‌, గోగినేని సతీష్‌, దేవిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాస్‌, అడక గంగయ్య, ఆదిపూడి వంశీ, గొర్రుముచ్చు సురేంద్ర, వివిధ హోదాలలోని నాయకులు, కార్యకర్తలు, మహిళా రైతులు, పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

03పీఆర్సీ150

(డీసీ ఫొటో)

03పీఆర్సీ154 నిరసన ధర్నాలో పాల్గొన్న రైతులు, మహిళా రైతులు, పార్టీ మహిళా కార్యకర్తలు

వైఎస్సార్‌ సీపీ పర్చూరు ఇన్‌చార్జి మధుసూదనరెడ్డి మాట్లాడుతూ పర్చూరు ప్రాంతంలో సుమారు 54 వేల ఎకరాల్లో 8 లక్షల క్వింటాళ్ల పొగాకును పండించారని.. ప్రభుత్వం, ప్రైవేట్‌ కంపెనీల ద్వారా 3 లక్షల క్వింటాళ్లు మాత్రమే అమ్ముడు పోగా ఇంకా 5 లక్షలు క్వింటాళ్లు రైతుల వద్ద మిగిలిపోయిందన్నారు. గడచిన రెండేళ్లుగా రైతుల వద్ద నిల్వ ఉన్న పొగాకు పాడై పోతోందని, రైతులు చేసిన అప్పులు, వడ్డీలు పెరిగి పోయి వారి పరిస్థితి మరింత దిగజారి పోతోందన్నారు. పర్చూరు ప్రాంత రైతుల సమస్యను వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్లి ఆయన ఆదేశాల మేరకు పొగాకు రైతుల పక్షాన పోరాటం చేపట్టామన్నారు. రైతుల వద్ద మిగిలి పోయిన పొగాకు చివరి కేజీ కొనుగోలు చేసేంత వరకు వైఎస్సార్‌ సీపీ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement