రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
డీఎంహెచ్‌వో రత్నమన్మోహన్
శావల్యాపురం: ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగి వివరాలను ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా వైద్యాదికారి చుక్కా రత్నమన్మోహన్ అన్నారు. సోమవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌వో ఆకస్మికంగా సందర్శించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రాల్లో కాన్పుల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లోని ఆరోగ్యకర్తలు, ఆశలు గర్భిణులు కాన్పుల కోసం ప్రైవేటు వైద్యశాలకు వెళ్లకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తూ వారికి మరింత భరోసా కల్పించాలన్నారు. అనంతరం వైద్యశాలలోని లేబొరేటరీ, ఔషదాలు, పంపిణీ విభాగం, ప్రసూతి గది, ఆపరేషన్ థియేటర్, వార్డులు, కంప్యూటర్ విభాగం క్షుణ్ణంగా పరిశీలించారు. వైద్యశాల పరిసరాలు పరిశీలించి పనితీరును నిర్వహణ బాగుందుని ప్రశంసించారు. ఆయనతోపాటు డెప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టరు మురళీకృష్ణ, డీసీ ఆరోగ్యశ్రీ చంద్రశేఖర్, వైద్యాధికారులు మాణ్యం రాధాకృష్ణన్, రావిపూడి రమ్య, సూపర్‌వైజర్లు నారాయణమ్మ, ఏడుకొండలు, ఉమాదేవి, స్టాఫ్‌నర్సు ధనలక్ష్మి, ల్యాబ్ టెక్నీషియన్ సతీష్, ఫార్మాసిస్ట్ లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.


