శ్రీశైలం నిండితే సాగర్‌కు నీటి విడుదల
అమరావతి: అమరావతిలోని అమరేశ్వరునికి సోమవారం శాస్త్రోక్తంగా సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. దేవదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ కార్యనిర్వహణాధికారి సైదమ్మబాయ్ ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు సంకల్పం మహాన్యాసం, వరుణజపం, సూర్యనమస్కారాలు నిర్వహించారు. తొలుత ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ మహాన్యాసం నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకులు, గ్రామంలోని బ్రాహ్మణులు పవిత్ర కృష్ణానది నుంచి ఊరేగింపుగా ఘటాలతో జలాలను తీసుకువచ్చి స్వామివారికి ప్రదక్షిణం నిర్వహించి అభిషేకించారు. అనంతరం రుత్విక్‌లు వరుణ జపాలు, సూర్యనమస్కారాలు చేయగా వేదపండితులు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటిగంటవరకు సహస్ర రుద్రాలతో స్వామివారికి కృష్ణ జలాలతో అభిషేకించిన అనంతరం అమరేశ్వరునికి ప్రత్యేక అలంకారం చేసి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులకు ఉచిత ప్రసాదాలను పంపిణీ చేశారు. సహస్ర ఘటాభిషేకం కార్యక్రమంలో మండల పరిధి గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మాచర్ల: విజయపురిసౌత్ గ్రామంలో ఐదురోజుల కిందట దేచవరపు క్యాంపు తండాలో పాతకక్షల నేపథ్యంలో ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. పోలీసులు రామచంద్రనాయక్, అతని కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారంటూ అరెస్టుచేసి సోమవారం సివిల్ అదనపు జూనియర్ న్యాయమూర్తి కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి రిమాండ్ విధించారు.


