అదనపు కోర్టుల కోసం భవనాల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

అదనపు కోర్టుల కోసం భవనాల పరిశీలన

Apr 8 2026 8:02 AM | Updated on Apr 8 2026 8:02 AM

అదనపు కోర్టుల కోసం భవనాల పరిశీలన గ్యాస్‌ కంపెనీలో తనిఖీలు దుర్గమ్మకు కానుకగా బంగారు మంగళసూత్రాలు ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్‌కు చెందిన భక్తులు మంగళవారం రూ. 2.70 లక్షల విలువైన బంగారు మంగళ సూత్రాలను కానుకగా సమర్పించారు. హైదరాబాద్‌కు చెందిన టి.శ్రీనివాసరావు కుటుంబం అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి 20 గ్రాముల బంగారంతో తయారు చేయించిన రెండు మంగళ సూత్రాలు, రెండు పూసలను ఆలయ అధికారులకు అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారి డీవీవీ సత్యనారాయణ, అర్చకులు అమ్మవారి చిత్ర పటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.

అమరావతి: అనుమతించబడిన అదనపు కోర్టుల ఏర్పాటు నిమిత్తం మంగళవారం స్థానిక ప్రభుత్వ, ప్రైవేటు భవనాలను పలువురు న్యాయమూర్తులు పరిశీలించారు. ఈ పరిశీలనలో గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయికళ్యాణ చక్రవర్తి, సత్తెనపల్లి సీనియర్‌ సివిల్‌ జడ్జి విజయకుమార్‌ రెడ్డి, సత్తెనపల్లి ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి అహ్మద్‌, ఒకటవ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి ప్రియ దర్శిని, రెండవ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి సృజన్‌కుమార్‌, సత్తెనపల్లి రెవెన్యూ డివిజనల్‌ అధికారి రాములు, తహసీల్దార్‌ డానియేల్‌, ఎంపీడీఓ పార్వతి, సీఐ అచ్చియ్య, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.

తాడేపల్లిరూరల్‌: తాడేపల్లిలోని బాలాజీ హెచ్‌పీ గ్యాస్‌ కంపెనీలో పౌర సరఫరాల డైరెక్టర్‌ శ్రీవాస్‌ నుపూర్‌ అజయ్‌ కుమార్‌ మంగళవారం తనిఖీలు చేశారు. ఆన్‌లైన్‌ గ్యాస్‌ బుకింగ్‌ నమోదులను, డెలివరీ బాయ్స్‌ గ్యాస్‌ సిలిండర్లు డోర్‌ డెలివరీ చేసే విధానాన్ని గ్యాస్‌ ఏజన్సీ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. గ్యాస్‌ కంపెనీ వద్ద ఉన్న వినియోగదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. గ్యాస్‌ బుకింగ్‌ తేదీ ప్రకారం ముందుగా బుక్‌ చేసుకున్న వారికి సరఫరా చేయాలని నిర్వాహకులకు ఆదేశించారు. గ్యాస్‌ గోడౌన్ల వద్ద సిలిండర్లను డెలివరీ చేయవద్దని, తప్పని సరిగా డోర్‌ డెలివరీ చేయాలన్నారు. వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని సూచించారు. ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తే ఆయా ఏజన్సీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినియోగదారులు గ్యాస్‌ డెలివరీ సమయంలో డెలివరీ బాయ్స్‌కు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో గుంటూరు డీఎస్‌ఓ కోమలి పద్మ, తాడేపల్లి తహసీల్దార్‌ సీతారామయ్య, మంగళగిరి సివిల్‌ సప్లయీస్‌ డీటీ శ్రీనివాసరావు, వీఆర్‌ఓ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement