170 కేజీల రాగి తీగ స్వాధీనం గురజాల ఇన్‌చార్జి డీఎస్పీ వెంకటరమణ వెల్లడి
మంగళగిరి టౌన్: కృష్ణాజిల్లా చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో బాణసంచా పేలుడు ఘటనలో గాయపడిన బాధితులకు అండగా ఉంటామని రాష్ట్ర హోమ్ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. మంగళగిరి మండల పరిధిలోని చినకాకాని ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చల్లపల్లి పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ దుర్గ ఆంజనేయులు, కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లా, డ్రైవర్ నాగరాజులను సోమవారం హోమ్ మంత్రి అనిత పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులకు ధైర్యం చెప్పి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చికిత్స పొందుతున్న పోలీసులకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి యాజమాన్యానికి సూచించినట్లు పేర్కొన్నారు. కానిస్టేబుల్ అబ్దుల్లా 50–60 శాతం గాయాలతో ఉన్నారని చికిత్సకు సహకరిస్తున్నట్లు వైద్యులు తెలిపారన్నారు. మిగిలిన ఇద్దరిని ప్రాణాపాయం లేదని తెలిపారు. గాయపడిన పోలీసుల ఆరోగ్య పరిస్థితులను కృష్ణాజిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామన్నారు. కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం చికిత్సపొందతున్న వారికి మెరుగైన వైద్య అందించాలని ఎన్‌ఆర్‌ఐ వైద్యులను ఆదేశించారు.
మాచవరం: విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు పగలగొట్టి వాటిలో ఉన్న రాగి తీగను దొంగిలించిన సంఘటనలో ఐదుగురు నిందితులతోపాటు, వాటిని కొనుగోలు చేసిన మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు గురజాల ఇన్‌చార్జి డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. మాచవరం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు పొలాలకు సాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు లక్ష్యంగా చేసుకొని తెనాలి, మంగళగిరి ప్రాంతాలకు చెందిన ఓ ముఠా ఈ చోరీలకు పాల్పడుతుందని వెల్లడించారు. మాచవరం మండలం గోవిందపురం గ్రామానికి చెందిన వేముల ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం ఉదయం మండలంలోని గోవిందపురం బల్లకట్టు వద్ద కొందరు వ్యక్తులు అనుమానంగా సంచరిస్తుండగా అదుపులోకి తీసుకొని విచారించగా రాగి తీగలను దొంగతనం చేసే వ్యక్తులుగా గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. అరెస్టు చేసిన వారిలో మొలిక ముత్యం, ఏ గసిరి కోటయ్య , పెండ్ర , వెంకటేష్ కట్టా వెంకటేశ్వర్లులు ఉన్నారు. వీరు దొంగిలించిన రాగి తీగను మంగళగిరి ప్రాంతానికి చెందిన బత్తుల తారకేశ్వరరావు, వారణాసి సతీష్‌లకు విక్రయిస్తున్నారు. వారిపై కూడా కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. 20 కేసుల్లో సుమారు 85 ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి దొంగిలించిన 350 కిలోల రాగి వైర్‌కుగాను 170 కిలోల రాగి వైర్‌ను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. రైతులు పొలాల్లోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలనీ సూచించారు. ఎక్కడైనా విద్యుత్ వైర్లు దొంగతనానికి గురైనట్లయితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని అన్నారు. నిందితులను అరెస్టు చేసిన మాచవరం ఎస్సై పవన్ కుమార్ పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు.
హోం మంత్రి అనిత


