బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎస్ మాధవ్
గుంటూరు మెడికల్: మాజీ ప్రధాని వాజ్‌పేయి చరిత్ర ప్రతి ఒక్కరికీ ఆదర్శమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎస్.మాధవ్ పేర్కొన్నారు. బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ గుంటూరు లక్షీపురంలోని వాజపేయి సర్కిల్‌లో వాజపేయి విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మాధవ్ మాట్లాడుతూ బీజేపీ ఆవిర్భావం జరిగి నేటీకి 46 వసంతాలు పూర్తయ్యాయన్నారు. మన ఊరు–మన జండా కార్యక్రమం ఆరునెలలపాటు కొనసాగిస్తామని తెలిపారు. ప్రతి గ్రామానికి రూ.2 కోట్లు నిధులు కేంద్రం విడుదల చేసిందని తెలిపారు. ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగురవేస్తామని చెప్పారు. అటల్ బీహారి వాజ్‌పేయి చరిత్ర బీజేపీ చరిత్రతో ముడిపడి ఉందన్నారు. ఒక చేతిలో బీజేపీ జెండా, మరో చేతిలో కూటమి అజండా ఉండాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా రూ.15 లక్షల కోట్లు ఏపీకీ కేంద్ర కేటాయించిందన్నారు. కార్యక్రమంలో బెహరా గాయత్రి, పాలపాటి రవికుమార్, డాక్టర్ స్రవంతి, లకరా, పవన్ సాయి, సోలంకి, మహాలక్ష్మి, మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి, పనతల సురేష్, సయ్యద్ బాషా, యడ్లపాటి స్వరూపరాణి, కొత్తూరు వెంకట సుబ్బారావు, భీమినేని చంద్రశేఖర్, గంగాధర్, నేరళ్ల మాధవరావు, వక్కలగడ్డ తిరుమలరావు, నాగేశ్వరరావు, భజరంగ్ రామకృష్ణ, దేసు సత్యనారాయణ, కారంశెట్టి రమేష్, శ్రావణ కుమారి, అనుమోలు ఏడుకొండలు గౌడ్, రాచుమల్లు భాస్కర్, జితేంద్ర గుప్తా, ప్రవీణ్, రావుల రాజశేఖర్, అబ్రహం, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం
బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయం వాజ్ పేయి భవన్ వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీన్ మాధవ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.


