బాపట్ల: బాపట్ల జిల్లా వాసి శ్రీమన్నారాయణకు జాతీయ స్థాయిలో ఉత్తమ కౌన్సిలర్‌గా అవార్డు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ అన్నారు. జాతీయస్థాయి శిక్షణ కార్యక్రమంలో ఉత్తమ కౌన్సిలర్‌గా అవార్డు పొందిన శ్రీమన్నారాయణ జిల్లా కలెక్టర్‌ను మంగళవారం కలెక్టరేట్‌లో కలిశారు. ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లో మార్చి 25 నుండి 29 వరకు అంతర్‌రాష్ట్ర జూనియర్ రెడ్‌క్రాస్ స్టడీ కం ట్రైనింగ్ క్యాంపు జరగ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బృందానికి బాపట్ల జిల్లాకు చెందిన పిన్నిబోయిన శ్రీమన్నారాయణ కౌన్సిలర్‌గా ప్రాతినిధ్యం వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన రెడ్‌క్రాస్ బృందాలు వివిధ కార్యక్రమాలు నిర్వహించాయి. ఏపీకి ఉత్తమ కౌన్సిలర్ అవార్డును ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం అందించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి సుమారు రెండు వందలకు పైగా ప్రతినిధులు ఈ శిక్షణ శిబిరానికి హాజరయ్యారు. ప్రకృతి విపత్తుల నిర్వహణ, ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్, సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్, జాతీయ సమగ్రత వంటి అంశాలలో శిక్షణలు ఇచ్చారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రతిభ కనబరచిన ఉత్తమ కౌన్సిలర్‌గా గుర్తించి రెడ్‌క్రాస్ జాతీయ అవార్డును ప్రదానం చేసింది. కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బిఎస్ నారాయణ భట్టు, తదితరులు పాల్గొన్నారు.


