రెవెన్యూ అధికారుల బాధ్యతలు కీలకం | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ అధికారుల బాధ్యతలు కీలకం

Apr 1 2026 8:42 AM | Updated on Apr 1 2026 8:42 AM

రెవెన్యూ అధికారుల బాధ్యతలు కీలకం

ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత

బాపట్ల: నిషేధిత భూముల జాబితాలో పెండింగ్‌ ఉన్న కేసులను వెంటనే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోదకుమార్‌ అధికారులకు సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లోని న్యూ వీసీ హాలులో 22ఏ నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించే ప్రక్రియపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ నిషేధిత జాబితాలో పొరపాటున చేర్చబడిన భూములను గుర్తించి, సరైన ఆధారాలతో త్వరితంగా తొలగించే చర్యలు చేపట్టాలని సూచించారు. నిషేధిత భూముల జాబితా నుంచి పట్టా భూములను తొలగించడం, భూమి యజమానులకు హక్కు కల్పించాలన్నారు. గతేడాది జూన్‌ నుంచి ఇప్పటివరకు 410 అర్జీలు వచ్చాయన్నారు. అందులో 44 అర్జీలకు సంబంధించిన భూములను తొలగించి, భూమి యజమానులకు యాజమాన్య హక్కు కల్పించామన్నారు. కొన్ని మండలాలలో పూర్వ జిల్లాలు గుంటూరు, ప్రకాశం జిల్లాల పేర్లు ఉన్నాయని వెంటనే తొలగించి బాపట్ల జిల్లా పేరు రాయాలని తహసీల్దార్లను ఆదేశించారు. సమావేశంలో జిల్లా స్థాయి కమిటీలో జిల్లా సంయుక్త కలెక్టర్‌ భావన వశిష్ఠ, చీరాల, బాపట్ల ఆర్డీఓలు చంద్రశేఖర్‌, బి.శ్రీదేవి, రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు, అనుబంధ శాఖల అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

అట్రాసిటీ కేసులలో బాధితులకు

పరిహారం అందేలా చర్యలు

అట్రాసిటీ కేసుల్లో బాధితులకు చెల్లించాల్సిన పరిహారం, ఉద్యోగాలు, ప్రత్యేక పింఛన్లు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత సమావేశంలో లేవనెత్తిన సమస్యల పరిష్కారంపై పురోగతిని పరిశీలించిన కలెక్టర్‌, జిల్లా మానిటరింగ్‌ కమిటీ సభ్యులు ప్రస్తావించిన అంశాలను శ్రద్ధగా విన్నారు. బాధిత కుటుంబాలకు అందాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రత్యేక పింఛన్ల అంశాలపై ప్రత్యేకంగా చర్చించి, ఇప్పటికే కొన్ని కేసుల్లో పింఛన్ల మంజూరు పూర్తయ్యిందని తెలిపారు. మిగిలిన కేసుల్లో కూడా ఆలస్యం లేకుండా పరిష్కారం చూపించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో సోషల్‌ వెల్ఫేర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ సత్యనారాయణ, డీఆర్‌డీఏ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ సింగయ్య, చీరాల, రేపల్లె ఆర్డీవోలు చంద్రశేఖర్‌, శ్రీదేవి, డీఎంహెచ్‌వో విజయమ్మ, పొలీస్‌ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వేము భగవాన్‌దాస్‌, ఆల్ఫ్రెడ్‌ రాజా, సల్మాన్‌, మిల్టన్‌ లూథర్‌ శాస్త్రి, కే వెంకట ప్రసాద్‌, డి.పోతురాజు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌

ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత ఉంచాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌ తెలిపారు. ఈవీఎం గోదాములు, వీవీ ప్యాట్స్‌ గోదాముల త్రైమాసిక పరిశీలనలో భాగంగా జిల్లా కలెక్టర్‌ మంగళవారం తనిఖీ చేశారు. గోదాములకు సీల్‌ వేసిన తాళాలు, సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును, భద్రతా సిబ్బంది విధులను అడిగి తెలుసుకున్నారు. గోదాములను తెరిచి లోపల ఉన్న గదులను పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్వో జి.గంగాధర్‌గౌడ్‌, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు షేక్‌ షఫీ, బీజేపీ నాయకులు రామకృష్ణ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు దోనేపూడి రవి, సీపీఐ నాయకులు గంగయ్య, ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులు బాలాజీరెడ్డి, బీఎస్పీ నాయకులు రాజారావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement