మద్యం.. మాయాజాలం! ప్రజలను మత్తుతో చిత్తు చేస్తున్న చంద్రబాబు సర్కార్
చీరాల అర్బన్: మద్యం వ్యాపారులు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. అందుకు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ అధికారులు కొమ్ము కాస్తున్నారు. వాస్తవానికి మద్యపాన ప్రియుల సంఖ్య పెరుగుతోంది. లైసెన్స్ పొందిన వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లలో మద్యం విక్రయాలు తగ్గుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. గణనీయంగా పెరిగిన మద్యం బెల్ట్ దుకాణాలలో ఎన్‌డీపీ(నాన్ డ్యూటీ పెయిడ్) లిక్కర్ విక్రయిస్తున్నారు. నకిలీ మద్యం కూడా అమ్ముతున్నారనే విమర్శలు వస్తున్నారు. బెల్ట్ షాపులలో మద్యం క్వార్టర్ బాటిల్‌కు అదనంగా రూ.20 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్నారు. 216 జాతీయ రహదారి సమీపంలో ఏర్పాటు చేస్తున్న, చీరాల మసీదు సెంటర్లో ఏర్పాటు చేసిన బార్ అండ్ రెస్టారెంట్‌లు కూడా నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఎకై ్సజ్ శాఖ అధికారులు కనుసన్నల్లోనే, వారి ఆశీస్సులతోనే జరుగుతున్నాయని ప్రజలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
పెరిగిన మద్యం వినియోగం..
చీరాల ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలో 27 వైన్ షాపులు ఉన్నాయి. అందులో 3 షాపులు గీత కార్మికులకు కేటాయించినవి. బార్ అండ్ రెస్టారెంట్లు 7 ఉన్నాయి. వాస్తవానికి మద్యం వినియోగం పెరిగింది. కానీ ఎకై ్సజ్ అధికారుల గణాంకాల ప్రకారం వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లలో మద్యం విక్రయాలు తగ్గుతున్నాయని, తాము కష్టపడి టార్గెట్‌ల ప్రకారం తాగిస్తున్నామని చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో చీరాల సర్కిల్ పరిధిలో ఈ నెల టార్గెట్ రూ.18 కోట్లు కాగా. రూ.15 కోట్లు వ్యాపారమే జరిగిందని, మిగిలిన రూ.3 కోట్లు కూడా సేల్స్‌కు లైసెన్సీలపై ఒత్తిడి తెస్తున్నామని అధికారులు చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
బెల్ట్ దుకాణాలకు వేలం
వాస్తవానికి మద్యం విక్రయాలు పెరిగాయనేది బహిరంగ రహస్యం. ఈ క్రమంలో పలు మద్యం దుకాణాలకు సంబంధించిన వ్యక్తులే తమ, తమ పరిధిలో బెల్ట్ షాపుల నిర్వహణకు తెరతీశారు. కొన్ని చోట్ల బహిరంగ వేలం పాటలు పెట్టి పెద్ద మొత్తంలో పాట పాడి నిర్వహిస్తున్నారని అంటున్నారు. అందుకు రాజకీయ, అధికారుల అండ లేకుండా సాధ్యం కాదనేది బహిరంగ రహస్యం. బెల్ట్ దుకాణాల్లో వైన్ షాపుల నుంచి సరఫరా అయ్యే మద్యంతోపాటు, కల్తీ మద్యం, ఎన్‌డీపీ (నాన్ డ్యూటీ పెయిడ్)లిక్కర్ భారీగా చెలామణి అవుతోందంటున్నారు. ఈ క్రమంలోనే లైసెన్స్‌డ్ మద్యం దుకాణాల్లో విక్రయాలు తగ్గాయని చెబుతున్నారు.
గతంలో నియంత్రణకు ప్రత్యేక చర్యలు గతంలో గోవా, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి అక్రమంగా దిగుమతి అయ్యే ఎన్‌డీపీ లిక్కర్‌ను పలు సందర్భాల్లో పెద్ద మొత్తాల్లో అధికారులు పట్టుకున్నారు. స్థానిక అధికారులకు తెలిసినా తెలియనట్లు వ్యవహరిస్తున్నారనే ప్రచారం ఉంది. పోలీస్‌శాఖ, సెబ్ ఉన్నతాధికారులకు దీనిపై సమాచారం అందింది. సంయుక్త దాడులు నిర్వహించగా ఒకటికి రెండు పర్యాయాలు కంటైనర్లలో గోవా మద్యం పట్టుపడింది. అలా పలు సందర్భాల్లో ఇతర వాహనాల్లో కూడా గోవా, కర్ణాటక, తెలంగాణ మద్యం చిక్కింది. ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి మద్యం దిగుమతి అవుతున్నార అధికారులు మిన్నకుంటున్నారా అనే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి.
లక్ష్యసాధనకు ప్రయత్నాలు
మద్యం విక్రయాలు తగ్గాయి. రూ.18 కోట్లు టార్గెట్ ఉంటే సోమవారం ఉదయానికి రూ.15 కోట్లు మాత్రమే సాధించాం. మిగిలిన రూ.3 కోట్ల మద్యం విక్రయానికి సంబంధించి లైసెన్సీలతో మాట్లాడుతున్నాం. బెల్ట్ షాపులు లేవు. ఎన్‌డీపీ లిక్కర్, కల్తీ మద్యం విక్రయాలకు ఆస్కారం లేదు. అలా ఎవరన్నా పాల్పడితే చర్యలు తప్పవు. హైవే సమీపంలో బార్ అండ్ రెస్టారెంట్‌కు ఓ కోర్టు తీర్పు నేపథ్యంలో వెసులుబాటు ఉంది. చీరాల మసీదు సెంటర్లో ఏర్పాటు చేసిన బార్ అండ్ రెస్టారెంట్‌కు సంబంధించి మసీదు నుంచి కౌంటర్‌కు 100 మీటర్లు పైనే ఉంది. నిబంధనలు అతిక్రమిస్తే ఎవర్నీ ఉపేక్షించం.
216 నంబరు జాతీయ రహదారికి సమీపంలో రామాపురం వెళ్లే దారిలో నూతనంగా ఓ బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటుకు పనులు చురుగ్గా సాగుతున్నాయి. వాస్తవానికి హైవేకి 220 మీటర్లులోపు ఏర్పాటు చేయకూడదు. గతంలో ఓ లైసెన్సీ కోర్టును ఆశ్రయించిన క్రమంలో హైవేకి 220 మీటర్లు దూరం ఉండాలనే నిబంధనను (మున్సిపాలిటీకి సమీపంలో అయితే) సడలించారని చెబుతూ ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రార్థన మందిరాలకు 100 మీటర్లలోపు మద్యం దుకాణాలు ఉండకూడదనేది మరో నిబంధన. చీరాల మసీదు సెంటర్ సమీపంలో మసీదుకు సమీపంలో కూడా అతిక్రమించి బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి.
తెరవెనుక అధికారులు
ఆలయ నిర్మాణానికి విరాళం
బాపట్ట
బుధవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
ప్రజలను మత్తుతో చిత్తు చేస్తున్న చంద్రబాబు సర్కార్
– ఎస్.శ్రీనివాసులు,
ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ, చీరాల
వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లలో తగ్గుతున్న విక్రయాలు
పుట్టగొడుగుల్లా బెల్ట్ దుకాణాలు
జోరుగా ఎన్‌డీపీ లిక్కర్ విక్రయాలు
పలుచోట్ల నకిలీ మద్యం
కూడా అమ్మకం
నరసరావుపేట రూరల్: ఇస్సపాలెంలోని మహంకాళి ఆలయ నిర్మాణానికి కొనకంచి లక్ష్మయ్య, కుమారి దంపతులు రూ.1.01,116 విరాళంగా అందజేశారు.