బాపట్ల: బాపట్ల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వైఎస్సార్‌సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షులు చల్లా రామయ్య పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో సంఘ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండుకళ్లులా ముందుకుపోతున్నామని చెప్పే నాయకులు ఎక్కడ, ఏవిధమైన అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో బాపట్ల ప్రాంతాభివృద్ధి మరో పదేల్లుపాటు వెనక్కిపోయిందన్నారు. పేదోళ్లకు అవసరమైన మెడికల్ కళాశాలను బాపట్ల నిర్మించేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కృషి చేస్తే కూటమి ప్రభుత్వం మోకాలు అడ్డుపెట్టి చోద్యం చూస్తోందని చెప్పారు. ఇప్పటికై న కూటమి ప్రభుత్వం పేదోళ్లకు అందే వైద్య సేవలు అడ్డుకునే కార్యక్రమాలు మానుకోవాలని సూచించారు. సమావేశంలో పార్టీ నాయకులు తన్నీరు అంకమ్మరావు, కటికల మోషే, పాల్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


