సహకార సంఘ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
పెదకూరపాడు: రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంఘం జిల్లా అధ్యక్షుడు గుడిపూడి పీఏసీఎస్ సీఈఓ జాన్ సైదా డిమాండ్ చేశారు. పెదకూరపాడులోని కో–ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్‌లో సోమవారం ఉద్యోగులు ధర్నా నిర్వహించి, మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. సంఘ సభ్యులు మాట్లాడుతూ జీఓ నెంబర్ 36 ను వెంటనే అమలుచేసి, పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ చేసి మధ్యంతర భృతిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రాడ్యూటీ చట్టాన్ని అమలుపరిచి చట్టపరంగా చెల్లించాలని కోరారు.
రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘం
జిల్లా అధ్యక్షుడు జాన్‌సైదా


