‘ప్రైవేటీకరణ’పై ప్రజాగ్రహం
వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వెల్లువెత్తిన జనాగ్రహం ‘ప్రైవేటీకరణ’పై ప్రజాగ్రహం ● చీరాల నియోజకవర్గంలో సమన్వయకర్త కరణం వెంకటేశ్ ఆధ్వర్యంలో 63,100 సంతకాలు సేకరించారు. వాటిని బుధవారం స్థానిక రామకృష్ణాపురం క్యాంపు కార్యాలయం నుంచి పొట్ల బజారు, ముంతావారి సెంటర్, క్లాక్ టవర్ మీదుగా ర్యాలీ నిర్వహించి బాపట్లకు తరలించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
● సమన్వయకర్త గాదె మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో పర్చూరులో పార్టీ నేతలు, కార్యకర్తలు స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి బొమ్మలసెంటర్, తహసీల్దారు కార్యాలయం మీదుగా బైక్, కార్ల ర్యాలీ నిర్వహించారు. సంతకాల పత్రాలను బాపట్లకు చేర్చారు. కార్యక్రమంలో పెద్దఎత్తున నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పర్చూరు నియోజకవర్గం నుంచి 65,064 సంతకాలు సేకరించారు.
● వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు ఆధ్వర్యంలో భట్టిప్రోలు మండలం అద్దేపల్లిలో తొలుత దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సంతకాల పత్రాలతో భట్టిప్రోలు వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. తరువాత సంతకాల ప్రతులను జిల్లా కేంద్రం బాపట్లకు తరలించారు. వేమూరు నియోజకవర్గంలో 62,035 సంతకాలు సేకరించారు.
● రేపల్లె సమన్వయకర్త ఈవూరి గణేశ్ ఆధ్వర్యంలో చెరుకుపల్లి మండలం గుళ్లపల్లి పార్టీ కార్యాలయం నుంచి సంతకాల పత్రాలను తీసుకొని ద్విచక్రవాహనాలు, కార్ల ద్వారా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు బాపట్లకు తరలివెళ్లారు. కార్యక్రమంలో పార్టీ నేతలు మదన్ మోహన్, ఒబేదు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. రేపల్లె నియోజకవర్గం నుంచి 60 వేల సంతకాలు సేకరించారు.
● అద్దంకి నియోజకవర్గంలో సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో వందల మంది నేతలు, కార్యకర్తలు నేతలు కోటి సంతకాల పత్రాలతో స్థానిక పార్టీ కార్యాలయం నుంచి బంగ్లా రోడ్డు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుంచి వాహనంలో పత్రాలను బాపట్లకు తరలించారు. అద్దంకి నియోజకవర్గం నుంచి 58 వేల సంతకాలు సేకరించారు. కార్యక్రమంలో సమన్వయకర్తతోపాటు నియోజకవర్గ పరిశీలకులు మోదుగుల బసవపున్నారెడ్డి, ప్రసాద్, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల సేకరణకు అనూహ్య మద్దతు నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రానికి చేరిన సంతక పత్రాలు భారీ ర్యాలీలు తీసిన సమన్వయకర్తలు, ముఖ్యనేతలు, కార్యకర్తలు
వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వెల్లువెత్తిన జనాగ్రహం
సాక్షి ప్రతినిధి, బాపట్ల: చంద్రబాబు ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉద్యోగులు, మేధావులు, యువత, ప్రజాసంఘాలు.. ఇలా అన్ని వర్గాల వారు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావండతోపాటు ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాకు ఒకటి చొప్పున వైద్య కళాశాలలను నెలకొల్పారు. చంద్రబాబు సర్కారు వాటిని ప్రయివేటుపరం చేసి చేతులు దులుపుకోవడంపై అన్నివర్గాలవారు ఆగ్రహంతో రగిలి పోతున్నారు. బాబు ప్రభుత్వం కక్షపూరిత విధానాలను నిరసిస్తూ మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు ప్రజలు కోటి సంతకాల కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి నిరసన తెలిపారు.
అన్నివర్గాల మద్దతు
బాపట్ల జిల్లాలో అక్టోబర్ 10వ తేదీ నుంచి కోటి సంతకాల కార్యక్రమం ప్రారంభమైంది. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో కార్యక్రమం సాగింది. నవంబర్ 12వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించారు. గ్రామగ్రామాన సంతకాల సేకరణ కార్యక్రమం ఉద్యమంలా సాగింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ వైఎస్సార్‌సీపీ శ్రేణులతోపాటు అన్నివర్గాల ప్రజలు మద్దతు తెలిపారు. డిసెంబర్ 9వ తేదీ నాటికి సంతకాల కార్యక్రమం ముగించి 10న సంతకాల పత్రాలను జిల్లా కేంద్రమైన బాపట్లకు తరలించారు. ఈ సందర్భంగా అన్ని నియోజకవర్గాల్లో బైక్, కార్ల ర్యాలీలు నిర్వహించారు. బాపట్ల నియోజకవర్గంలో మంగళవారమే సంతకాల పత్రాలను స్థానిక కోన చాంబర్‌లో సిద్ధం చేయగా కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బాపట్ల నియోజకవర్గంలో 65 వేల మంది సంతకాలు చేశారు.
మిగతా నియోజకవర్గాలలో ఇలా...
1/2
‘ప్రైవేటీకరణ’పై ప్రజాగ్రహం
2/2
‘ప్రైవేటీకరణ’పై ప్రజాగ్రహం