అడ్డగోలు కుట్రలు.. అక్రమ నిర్బంధాలు
పిన్నెల్లిని కలిసేందుకు వెళతారన్న సాకుతో పార్టీ శ్రేణులపై జులం
వేమూరు సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు గృహ నిర్బంధం
కోన రఘుపతి, ఈవూరి గణేష్, డాక్టర్ అశోక్‌కుమార్‌లకు నోటీసులిచ్చిన పోలీసులు
పర్చూరు సమన్వయకర్త గాదె మధుసూదన్‌రెడ్డి హౌస్ అరెస్ట్
నోటీసులు ఇవ్వకుండా జిల్లా ఉపాధ్యక్షుడు కోకి రాఘవరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
జిల్లా దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు చల్లా రామయ్య స్టేషన్‌కు తరలింపు
చీరాల, రేపల్లె, పర్చూరు నియోజకవర్గాల్లోని పలువురు నేతలకు నోటీసులు
అర్ధరాత్రి నుంచే వైఎస్సార్‌సీపీ నాయకులను వెంటాడిన పోలీసులు
వైస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా బరితెగింపు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: చంద్రబాబు పాలనలో పోలీసులు మరింతగా జులుం ప్రదర్శిస్తున్నారు. అవసరం లేకపోయినా వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను నిర్బధించి పాలకుల మెప్పు కోసం పరితపిస్తున్నారు. చంద్రబాబు సర్కారులో మార్కులు పొందేందుకు నానా తంటాలు పడుతున్నారు. గురువారం వైఎ్ససార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసేందుకు వెళుతున్నారంటూ జిల్లాలోని వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను గృహ నిర్బంధం చేసి ఇబ్బందులు పెట్టారు. కొందరు నేతలుకు నోటీసులు ఇచ్చి ఇంట్లోనే ఉండాలని ఆదేశించారు. మరికొందరికి అసలు నోటీసులు ఇవ్వకుండానే అర్ధరాత్రి ఇళ్లకు వెళ్లి మరీ జీపుల్లో తీసుకొచ్చి స్టేషన్లలో నిర్బంధించారు. పోలీసుల చర్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎక్కడ చూసినా అదే దౌర్జన్యం
అర్ధరాత్రి దౌర్జన్యంగా నేతల తరలింపు
వైఎస్సార్‌సీపీకి చెందిన కొందరు నేతలకు నోటీసులు ఇచ్చి గృహనిర్బంధం చేసిన పోలీసులు మరికొందరు నేతలు, కార్యకర్తలకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యపూరితంగా స్టేషన్‌కు తరలించారు. బాపట్లకు చెందిన వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి ఇంటికి 12 గంటల ప్రాంతంలో పట్టణ సీఐ రాంబాబు, ఎస్‌ఐ విజయకుమార్‌లు వెళ్లి కాలింగ్ బెల్ నొక్కారు. బయటకు వచ్చిన రాఘవరెడ్డిని స్టేషన్‌కు పదమంటూ జీపు ఎక్కించారు. కారణం చెప్పాలని, నోటీసు ఇవ్వాలని కోరినా పోలీసులు ససేమిరా అన్నారు. ముందు స్టేషన్‌కు పదమంటూ తీసుకువెళ్లారు. ఉదయం 10 గంటల వరకూ స్టేషన్లో నిర్బంధించారు. వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు సుధీర్‌బాబు, దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చల్లా రామయ్యలను సైతం పోలీసులు రాత్రంతా స్టేషన్‌లో ఉంచారు. చీరాలకు చెందిన వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు యాతం మేరిబాబు, విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు అశోక్‌లకు సైతం పోలీసులు నోటీసులు ఇచ్చారు.
అడ్డగోలు కుట్రలు.. అక్రమ నిర్బంధాలు
అడ్డగోలు కుట్రలు.. అక్రమ నిర్బంధాలు
అడ్డగోలు కుట్రలు.. అక్రమ నిర్బంధాలు


