31 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
వేటపాలెం: అర్ధరాత్రి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని, ఓ మినీ లారీని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై జనార్దన్ గురువారం తెలిపారు. రావూరిపేట వద్ద అర్ధరాత్రి పోలీస్‌లు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన మినీ లారీ ఆపారు. అందులో డ్రైవర్ పోలీసులను చూసి లారీని వదిలి పారిపోయాడు. లారీలో 31 బస్తాల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. లారీని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీనికి సంబంధించిన ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాట్లు ఎస్సై తెలిపారు. ఈ అక్రమ రేషన్ బియ్యాన్ని 9, 40 నెంబర్లు గల రెండు రేషన్ షాపుల నుంచి మోటుపల్లికి చెందిన పాత రేషన్ బియ్యం అక్రమంగా తరలించే వ్యక్తి కొనుగోలు చేసి అర్ధరాత్రి అక్రమంగా తరలిస్తున్నట్లు రేషన్ డీలర్లు చర్చించుకొంటున్నారు.


