గంజాయి చాక్లెట్లు పట్టివేత
చీరాల: రైలులో తరలిస్తున్న గంజాయి చాక్లెట్లను శుక్రవారం ఈగల్, జీఆర్పీ, ఆర్పీఎఫ్, సివిల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వీవీరందరూ బృందంగా శుక్రవారం పూరి నుంచి తిరుపతి వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలును వేటపాలెంలో తనిఖీలు చేశారు. జనరల్ బోగీలో తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన బ్యాగును పరిశీలించారు. అందులో 71 చాక్లెట్లు కనిపించాయి. వాటిని పరిశీలించగా గంజాయిగా తేలడంతో విచారణ చేపట్టారు. అయితే బ్యాగుకు సంబంధించిన వారు ఎవరూ లేకపోవడంతో స్వాధీనం చేసుకుని చీరాల జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించి, కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో గంజాయిని నిర్మూలించేందుకు ప్రత్యేక బృందాలుగా రైళ్లలో, బస్సులలో నిరంతరం తనిఖీలు చేస్తున్నామని ఈగల్ టీం బృంద సభ్యులు తెలిపారు.


