జాతీయ లోక్‌ అదాలత్‌లో కేసులు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

జాతీయ లోక్‌ అదాలత్‌లో కేసులు పరిష్కారం

Dec 14 2025 8:35 AM | Updated on Dec 14 2025 8:35 AM

జాతీయ

జాతీయ లోక్‌ అదాలత్‌లో కేసులు పరిష్కారం

జాతీయ లోక్‌ అదాలత్‌లో కేసులు పరిష్కారం పశ్చిమ డెల్టాకు 2,212 క్యూసెక్కులు విడుదల సాగర్‌ నీటిమట్టం వివరాలు

గుంటూరు లీగల్‌: గుంటూరు జిల్లా కోర్టులో జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కళ్యాణ్‌ చక్రవర్తి ఆధ్వర్యంలో జాతీయ లోక్‌ అదాలత్‌ను శనివారం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 53 బెంచీలను, గుంటూరు జిల్లా కోర్ట్‌ ప్రాంగణంలో 17 బెంచీలను ఏర్పాటు చేశారు. చిలకలూరిపేట ఎన్‌హెచ్‌16 వంతెన వద్ద జరిగిన ఒక ప్రమాదంలో అశోక్‌కి సంబంధించిన ప్రమాద బీమా కేసులో బాధిత కుటుంబానికి ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్సు కంపెనీ రూ. కోటి అందించింది. విజ్ఞాన్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌, డాక్టర్‌ పి. రాజారామ్మోహన్‌ మధ్య ఐదు ముఖ్యమైన చెక్‌ బౌన్స్‌ కేసులను పరిష్కరించారు. బెంగళూరులోని ఒక భూమి విక్రయ ఒప్పందం విఫలమైన వివాదంలో లోక్‌ అదాలత్‌ ద్వారా రూ.20 కోట్ల మేరకు రాజీ కుదిర్చారు. జిల్లా వ్యాప్తంగా సివిల్‌ కేసులు 1,376, క్రిమినల్‌ కేసులు 21,415, చెక్‌ బౌన్స్‌ కేసులు 578, ప్రీ లిటిగేషన్‌ కేసులు 97 కలిపి మొత్తం 23,466 కేసులు పరిష్కరించారు. న్యాయ సేవాధికార సంస్థ తరఫున కార్యదర్శి సయ్యద్‌ జియావుద్దీన్‌ సహకారం అందించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. విడిపోయిన జంటను ఐదవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి కె.నీలిమ సమక్షంలో కౌన్సెలింగ్‌ ద్వారా కలిపారు.

దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజి నుంచి పశ్చిమ డెల్టాకు 2,212 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజి వద్ద 12 అడుగుల నీటిమట్టం స్థిరంగా ఉంది. బ్యాంక్‌ కెనాల్‌ 150 క్యూసెక్కులు, తూర్పు కాలువకు 70, పశ్చిమ కాలువకు 45, నిజాంపట్నం కాలువకు 50, కొమ్మూరు కాలువకు 1,666 క్యూసెక్కులు విడుదల చేశారు.

2 నుంచి విజయవాడ పుస్తక మహోత్సవం

వన్‌టౌన్‌(విజయవాడ పశ్చిమ): విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ ఆధ్వర్యంలో జనవరి 2 నుంచి 12వ తేదీ వరకు 36వ విజయవాడ పుస్తక మహోత్సవం నిర్వహించనున్నట్లు సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు టి.మనోహర్‌నాయుడు, కె.లక్ష్మయ్య తెలిపారు. సొసైటీ కార్యాలయంలో శనివారం పుస్తక మహోత్సవం పోస్టర్లను ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. ఇందిరాగాంధీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియం ప్రాంగణంలో జరిగే ఈ పుస్తక మహోత్సవం ప్రాంగణానికి వడ్లమూడి విమలాదేవి, ప్రధాన వేదికకు ప్రముఖ రచయిత డాక్టర్‌ బి.వి.పట్టాభిరామ్‌, విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించే ప్రతిభ వేదికకు జయంత్‌ నార్లేకర్‌ పేర్లు పెడుతున్నట్లు వెల్లడించారు. రెండో తేదీ సాయంత్రం ఆరు గంటలకు పుస్తక మహోత్సవం ప్రారంభమవుతుందని, ముఖ్యమంత్రిని లేదా ఉపముఖ్యమంత్రి తదితర ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. జనవరి ఐదో తేదీ సాయంత్రం పుస్తక ప్రియుల పాదయాత్ర జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షుడు జె.ప్రసాద్‌, సహాయ కార్యదర్శి ఎ.బి.ఎన్‌.సాయిరామ్‌, కోశాధికారి కె.రవి, కార్యవర్గ సభ్యులు జి.లక్ష్మి, నాగిరెడ్డి, శ్రీనివాస్‌, ఎ.భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం శనివారం 574.10 అడుగులకు చేరింది. ఇది మొత్తం 266.8601 టీఎంసీలకు సమానం. సాగర్‌ జలాశయం నుంచి కుడి కాలువకు వెయ్యి, ఎడమ కాలువకు 8,541, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రానికి 29,354, ఎస్‌ఎల్‌బీసీకి 1,800, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. జలాశయం నుంచి ఔట్‌ఫ్లోగా 49,995 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి 49,995 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

జాతీయ లోక్‌ అదాలత్‌లో కేసులు పరిష్కారం   1
1/3

జాతీయ లోక్‌ అదాలత్‌లో కేసులు పరిష్కారం

జాతీయ లోక్‌ అదాలత్‌లో కేసులు పరిష్కారం   2
2/3

జాతీయ లోక్‌ అదాలత్‌లో కేసులు పరిష్కారం

జాతీయ లోక్‌ అదాలత్‌లో కేసులు పరిష్కారం   3
3/3

జాతీయ లోక్‌ అదాలత్‌లో కేసులు పరిష్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement