బాపట్ల
శనివారం శ్రీ 13 శ్రీ డిసెంబర్ శ్రీ 2025 చితికిన కూలీల బతుకులు కొల్లూరు: కొబ్బరి బొండాల కోత కూలీల జీవితాలను ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. కూత వేటు దూరంలో గమ్యస్థానాలకు చేరుకుంటారనుకునే సమయంలో మృత్యువు వెంటాడటంతో బతుకులు చితికిపోయాయి. అతివేగంగా ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి పంట కాలువలోకి పల్టీ కొట్టడంతో ముగ్గురు కూలీల ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. వాహనం పల్టీ కొట్టడంతో కొబ్బరి బొండాల కింద ఇరుక్కుపోయి, కాలువ బురదలో కూరుకుపోయి ముగ్గురు ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోవడం విషాదానికి దారి తీసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం చింతమోటుకు చెందిన సమ్మెట గణేష్ తన టాటా ఏస్ వాహనంలో కొల్లూరు మండలం లంక గ్రామాల నుంచి కొబ్బరి బొండాలు రవాణా చేస్తున్నాడు. కొల్లూరు వైపు నుంచి చెరుకుపల్లికి లోడ్‌తో వెళుతున్నాడు. వాహనంలోని లోడ్‌పై నలుగురు కూలీలు కూర్చుని ప్రయాణిస్తుండగా, డ్రైవర్‌తోపాటు మరో ముగ్గురు క్యాబిన్‌లో ఉన్నారు. మండలంలోని దోనేపూడి – కోటిపల్లి మధ్యలో తెనాలి – రేపల్లె రహదారిపై వాహనం ప్రయాణిస్తున్న సమయంలో అతివేగం కారణంగా వాహనాన్ని అదుపుచేయడం డ్రైవర్ గణేష్‌కు కష్టతరమైంది. రోడ్డు కుడివైపున ఉన్న పంట కాలువలోకి వాహనం దూసుకుపోయి పల్టీ కొట్టడంతో కొబ్బరి బొండాల లోడ్‌పై కూర్చున్న నలుగురిలో ముగ్గురు సంఘటన స్థలంలో మృతి చెందారు. మరో వ్యక్తి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. క్యాబిన్‌లో ప్రయాణిస్తున్న మరో ఇరువురు గాయాలపాలవడంతో తెనాలి వైద్యశాలకు తరలించారు.
మృతులు వీరే.. భట్టిప్రోలు మండలం చింతమోటుకు చెందిన చాట్రగడ్డ కాంతారావు (55), పెసర్లంక శ్రీనివాసరావు (55), వెల్లటూరుకు చెందిన షేక్ ఇస్మాయిల్ (60) ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో డ్రైవర్ సమ్మెట గణేష్‌తోపాటు, అతని తండ్రి పోతురాజు గాయాలపాలయ్యారు. 108 వాహనంలో తెనాలి వైద్యశాలకు తరలించారు. ప్రమాదం సమాచారంతో మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో వచ్చి విలపించారు. వారి రోదనలు మిన్నంటాయి. వేమూరు సీఐ పీవీ ఆంజనేయులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
న్యూస్‌రీల్
సాగర్ నీటిమట్టం
శనివారం శ్రీ 13 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
చితికిన కూలీల బతుకులు
● పంట కాలువలోకి పల్టీ కొట్టిన కొబ్బరి
బొండాల వాహనం
● ప్రమాదంలో అక్కడికక్కడే
ముగ్గురు కూలీలు మృత్యువాత
షేక్ ఇస్మాయిల్ , కాంతారావు,శ్రీనివాసరావు (ఫైల్)
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 574.70 అడుగులకు చేరింది. శ్రీ శైలం నుంచి 50,665 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
1/7
బాపట్ల
2/7
బాపట్ల
3/7
బాపట్ల
4/7
బాపట్ల
5/7
బాపట్ల
6/7
బాపట్ల
7/7
బాపట్ల