పర్చూరులో గాదె హౌస్ అరెస్ట్
పర్చూరు(చినగంజాం): పిన్నెల్లి కేసులో పోలీసులు వైఎస్సార్ సీపీ పర్చూరు సమన్వయకర్త గాదె మధుసూదనరెడ్డిని బుధవారం అర్ధరాత్రి నుంచి హౌస్ అరెస్ట్ చేశారు. పీఆర్కే గురువారం కోర్టులో లొంగిపోయిన నేపథ్యంలో వారిని కలవకుండా ఆయనతోపాటు పలువురికి పోలీసులు నోటీసులు అందజేశారు. ఇంకొల్లు ఎస్‌ఐ జి. సురేష్ ఈ నోటీసులు ఇచ్చి ఇంకొల్లు మండలంలోని పావులూరులో గాదె స్వగృహం వద్ద ఇరువురు పోలీసులను కాపలాగా ఉంచారు. పర్చూరు మండల పార్టీ కన్వీనర్ కఠారి అప్పారావు, లంకా శివ, బీసీ జిల్లా ఉపాధ్యక్షుడు యద్దనపూడి హరి ప్రసాద్, పర్చూరు టౌన్ ప్రెసిడెంట్ జంగా వంశీ, ఇంకొల్లులో జిల్లా అధికార ప్రతినిధి బండారు ప్రభాకరరావు, మండల కన్వీనర్ చిన్ని పూర్ణారావు, సయ్యద్ సుభాని, కరి వాసు, సునీల్, చినగంజాంలో మండల కన్వీనర్ మున్నం నాగేశ్వరరెడ్డి, పంచాయతీరాజ్ నియోజకవర్గ కన్వీనర్ ఆసోది బ్రహ్మానందరెడ్డి, ఎం.హేమంత్ కుమార్ రెడ్డి, రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి మాచవరపు రవికుమార్, పాదర్తి ప్రకాష్, మండల ఉపాధ్యక్షుడు మేడికొండ సునీల్‌లకు పోలీసులు ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్‌ఐలు జీవీ చౌదరి, జి.సురేష్, శీలం రమేష్ ఆదేశాలతో పోలీస్ సిబ్బంది నోటీసులు అందజేశారు. వీరికి బుధవారం రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకు నిద్ర లేపి మరీ నోటీసులు అందజేయడం గమనార్హం.


