మార్టూరు పీఎస్‌ను సందర్శించిన ఐజీ
మార్టూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సౌత్ కోస్టల్ జోన్ ఐజీ పి. సర్వ శ్రేష్ట త్రిపాఠి, బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ బుధవారం రాత్రి మార్టూరు పోలీస్ స్టేషన్ సందర్శించారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల పర్యటన ముగించుకున్న ఐజీ అమరావతి వెళుతుండగా.. మార్టూరు స్టేషన్‌కు చేరుకున్న ఎస్పీ ఉమామహేశ్వర్ ఇతర అధికారులతో కలిసి ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఐజీ త్రిపాఠి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి తొమ్మిది గంటల ప్రాంతంలో గుంటూరు బయలుదేరి వెళ్లారు. బాపట్ల డీఎస్పీ గోగినేని రామాంజనేయులు, సీఐలు వారి వెంట ఉన్నారు.


