‘బెల్ట్’ తీశారు!
జె.పంగులూరు: ‘అపర కాళికలై.. అసుర సంహారం’ అని సాక్షి పత్రికలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. కోటపాడు గ్రామంలో ఎకై ్సజ్ అధికారులు మంగళవారం బెల్టు షాపులు తనిఖీ చేశారు. వీఆర్‌ఓ, గ్రామ మహిళా పోలీసులు, గ్రామస్తుల సమక్షంలో బత్తుల కొండలు, ఇరగని గోవిందమ్మ, గ్రంధి రామారావు, గ్రంధి మహాలక్ష్మి ఇళ్లు, పరిసర ప్రాంతాలను గాలించారు. అయితే మద్యం సీసాలు లభించలేదు. గతంలో గ్రంధి రామారావు, మహాలక్ష్మిపై అనధికార మద్యం బాటిళ్లు కలిగి ఉన్నారని కేసు నమోదు చేశామని తెలిపారు. మద్యం విక్రయాలు చేస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎకై ్సజ్ ఎస్సై భవాని, సిబ్బంది పాల్గొన్నారు.
‘బెల్ట్’ తీశారు!


