నేరం చేసిన ప్రతి ఒక్కరికీ శిక్ష పడాలి
జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్
బాపట్లటౌన్: నేరం చేసిన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా శిక్ష పడాలి. అప్పుడే ప్రజలకు పోలీస్‌శాఖపై నమ్మకం పెరుగుతుందని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. హత్యలు, పోక్సో, మహిళలపై జరిగిన అఘాయిత్యాలు, డీపీఎస్ కేసుల లో జైలు శిక్షల పురోగతిపై శనివారం సాయంత్రం జిల్లాలోని పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఎస్పీ బి. ఉమామహేశ్వర్ మాట్లాడుతూ హత్యలు, మహిళలు, పిల్లలపై జరిగిన నేరాలు, ఎన్డీపీఎస్ వంటి ముఖ్యమైన కేసుల ట్రయల్ సమయంలో కోర్టు కానిస్టేబుళ్లు, కోర్ట్ మానిటరింగ్ సిబ్బంది, సంబంధిత పోలీస్ అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించి, నేరస్తులకు తగిన శిక్షలు పడేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ పి.బాలమురళీ కృష్ణ, ఎస్బీ సీఐ జి.నారాయణ, జిల్లా లోని సీఐలు, పీఎస్‌ఐలు, కోర్ట్ కానిస్టేబుళ్లు, కోర్టు మానిటరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
అంకిత భావంతో
పనిచేసినప్పుడే గుర్తింపు
సిబ్బంది అంకితభావంతో పనిచేసినప్పుడే పోలీస్‌శాఖకు గుర్తింపు వస్తుందని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రశంసా పత్రం, జ్ఞాపికను అందుకున్న అద్దంకి పట్టణ సీఐ సుబ్బరాజును, రెండు వేర్వేరు ఘటనల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించి 16 మందిని రక్షించిన పర్చూరు పోలీసులను, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాన్ని శనివారం జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో అభినందించి ప్రశంసా పత్రాలను అందజేసి రివార్డు ప్రకటించారు.


