
అద్దె బస్సులకు మైలేజీ తిప్పలు
అద్దె డబ్బులు ఖర్చులకే సరిపోతున్నాయి..
జిల్లాలోని డిపోల్లో సగానికి అద్దె బస్సులే
56 సీటింగ్ కెపాసిటితో నడిపేందుకు ఆర్టీసీతో ఒప్పందం
ఫ్రీ బస్‌తో పెరిగిన రద్దీ
నిర్వహణ ఖర్చు పెంచాలంటూ వేడుకోలు
చీరాల అర్బన్: సీ్త్రశక్తి పథకంతో అద్దె బస్సుల యజమానులు కష్టాలపాలవుతున్నారు. పథకాన్ని పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మాత్రమే అమలు చేస్తున్నారు. జిల్లాలో అధిక శాతం బస్సులు హయర్ బస్సులే. కూటమి సర్కారు దెబ్బకు చితికిపోతున్నారు. నిర్వహణ భారం మోయలేకపోతున్నామని యజమానులు వాపోతున్నారు.
ఆందోళనలో అద్దె బస్సుల యజమానులు..
–జిల్లాలో చీరాల, బాపట్ల, రేపల్లె, అద్దంకి ఆర్టీసీ డిపోలున్నాయి. మొత్తం 253 బస్సులు సేవలందిస్తున్నాయి. సీ్త్రశక్తి పథకం 212 బస్సుల్లో అమలవుతోంది. అందులో వంద వరకు అద్దె బస్సులే నడుస్తున్నాయి. 56 సీటింగ్ కెపాసిటీతో నడిపేందుకు యజమానులతో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది. రద్దీ పెరగడంతో మైలెజ్ పడిపోయింది. మెయింట్‌నెన్స్‌పై ఆందోళన చెందుతున్నారు. అద్దె బస్సుల టెండర్ల సమయంలో ఫ్రీ బస్ ప్రస్తావనే లేదని, తక్కువ కోడ్ చేసిన వారికే టెండర్లు దక్కడంతో ఇప్పుడే ఏమి చేయలేని స్థితిలో ఉన్నామంటూ ఆందోళన చెందుతున్నారు.
ఆర్టీసీ కంటే అద్దె బస్సులే అదనం..
జిల్లాలో మొత్తం 212 బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలవుతుంటే వీటిలో వంద బస్సుల వరకు అద్దె బస్సులున్నాయి. వీటిలో ఎక్స్‌ప్రెస్ 20, పల్లెవెలుగు 70 ఉన్నాయి. హయర్ బస్సులకు 56 సీటింగ్ కెపాసిటీ ఉండాలి. సర్వీసు రూట్‌ను బట్టి టెండర్లలో కోడ్ చేసిన విధంగా పల్లెవెలుగు బస్సుకు రూ.8 నుంచి రూ.12 వరకు, ఎక్స్‌ప్రెస్‌కు రూ.9 నుంచి రూ.14 చొప్పున కిలో మీటరుకు ఇస్తున్నారు. పల్లె వెలుగు బస్సుకు లీటర్ డీజిల్‌కు రూ.5.5 కిలోమీటర్లు ప్రయాణించాలి. మైలేజ్ షార్టేజ్ వస్తే ఆ భారాన్ని యజమానులే భరించాలి. ఫ్రీ బస్సు వలన ప్రయాణికుల రద్దీ పెరుగింది. కెపాసిటికి మించి బస్సులో ప్రయాణికులు ఎక్కితే ఓవర్ లోడ్ వలన టైర్లు అరుగుదల, ఇంజన్ సంబంధిత సమస్యలు తలెత్తి మెయింట్‌నెన్స్ పెరిగిపోతుంది. ప్రస్తుతం ఆయిల్ షార్టేజ్ వలన నెలకు అదనపు భారం పడుతుంది. అలానే రవాణా శాఖ నిబంధనల మేరకు సీటింగ్ కెపాసిటి 56 మందికే ప్రీమియం చెల్లిస్తారు. ఓవర్ లోడ్‌తో అనుకోని ప్రమాదం ఏదైనా జరిగితే బీమా కొందరికే వస్తుంది.
ఆర్టీసీలో అద్దె బస్సులు నడపడం ద్వారా కిలోమీటరుకు ఇచ్చే డబ్బులు బస్సుల మెయింట్‌నెన్స్‌కే సరిపోతున్నాయి. నెలకు లక్షన్నర రూపాయలు వస్తే అందులో ఈఎంఐ, డ్రైవర్లు, క్లీనర్ల జీతాలు, డీజిల్, మెయింట్‌నెన్స్‌కే సరిపోతుంది. నిర్వహణ భారం పెరగడంతో వచ్చిన ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువగా ఉన్నాయి. తమ సమస్యలపై రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పలుమార్లు యాజమాన్యానికి విన్నవించాం. కిలోమీటర్‌కు మైలేజ్ తగ్గించాలని, మెయింట్‌నెన్స్ చార్జీలు కిలోమీటర్‌కు పెంచాలని కోరుతున్నాం.
– ఎన్.శ్యామ్‌ప్రసాద్, స్టేట్ జనరల్ సెక్రటరీ, హయర్ బస్ ఓనర్స్ అసోసియేషన్
ఆందోళనలో యజమానులు