
రేవేంద్రపాడులో వెయిట్ లిఫ్టింగ్ జట్టు ఎంపికలు
దుగ్గిరాల: విద్యార్థులు చదువుతో పాటు ఆటలు కూడా ముఖ్యమని అని హెచ్.ఎం బి.వి.కృష్ణారావు చెప్పారు. మండలంలోని రేవేంద్రపాడు జెడ్పీ హైస్కూలులో ఆదివారం జిల్లాస్థాయి వెయిట్ లిఫ్టింగ్ జట్టు ఎంపికలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ గేమ్స్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో 17 నుంచి 19 సంవత్సరాల బాలబాలికల విభాగంలో ఎంపికలు జరిగినట్లు తెలిపారు. విద్యార్థులు చురుగ్గా ఉండటానికి ఆటలు ఆడాలని, దేహ దారుఢ్యం కూడా పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్లు నాగ శిరీష, రాంబాబు, వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
గుంటూరు రూరల్: తమలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకుని డబ్బులు ఇవ్వకుండా పరారయ్యారని జిల్లా ఎస్పీకి కళాకారులు ఆదివారం ఫిర్యాదు చేశారు. బాధితుడు, శ్లోక ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గంట స్వామి ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. రెడ్డిపాలెం ఇన్నర్ రింగ్ రోడ్‌లోని శ్రీ చైతన్య కళాశాల గ్రౌండ్ 99 అడుగుల మట్టి మహాగణపతిని ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసింది. నగరంలో ఉన్న వివిధ సాంస్కృతిక సంస్థలతో కలసి శ్లోకా ఫౌండేషన్ ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 20 వరకు నిత్యం శాసీ్త్రయ నృత్యాలతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించింది. ఉత్సవాల అనంతరం కళాకారులకు సొమ్మును ఇవ్వకుండా కమిటీ ప్రెసిడెంట్ నరేంద్రరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రాజానాయుడు, సెక్రటరీ లక్ష్మీరెడ్డిలు అందుబాటులో లేరని ఫిర్యాదు చేశారు. ఫోన్ ద్వారా కూడా సమాధానం చెప్పకుండా తప్పించుకొని వెళ్లి పోయారని ఆరోపించారు. కళాకారులు, చిన్నారులు, మహిళలు, మేకప్ మేన్‌కు రూ 1,75,000 ఇవ్వాలని తెలిపారు. వెంటనే నగదు ఇప్పించాలని స్వామి ఎస్పీకి విజ్ఞప్తి చేశారు.